Home /News /movies /

BOLLYWOOD QUEEN KANGANA RANAUT STRONG WARNING OVER REPORTS ON THALAIVI FILM FAKE NEWS NR

Kangana Ranaut: తలైవిపై తప్పుడు ప్రచారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కంగన!

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో.. పలుచోట్ల కొన్ని రంగాలు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో కఠిన చర్యలు తో రాకపోకలు బంద్ కూడా చేశారు.

    Kangana Ranaut: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో.. పలుచోట్ల కొన్ని రంగాలు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో కఠిన చర్యలు తో రాకపోకలు బంద్ కూడా చేశారు. ఇక తాజాగా సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు ఇలా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేస్ లను బంద్ చేయగా.. ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద కష్టమనే చెప్పవచ్చు.

    ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. అంతేకాకుండా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా థియేటర్లు బంద్ అవడంతో సినిమా విడుదలను కూడా వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. ఇక వాయిదా పడిన సినిమాలలో పలు సినిమాలు ఓటీటీ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా.. తాజాగా తన సినిమా పై తప్పుడు ప్రచారం చేసినందుకు కంగనా రనౌత్ వార్నింగ్ ఇచ్చింది.

    ప్రస్తుతం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన సినిమా 'తలైవి'. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత బయోగ్రఫీ నేపథ్యంలో తెరకెక్కనుంది. కంగనా ఇందులో టైటిల్ రోల్ లో నటించింది. ఇక ఈ సినిమా ఈనెల 23వ తేదీన విడుదల కానుండగా కరోనా తీవ్రత వల్ల సినిమా వాయిదా పడింది. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు రాగా కంగనా వారిపై మండిపడింది.

    ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దీనికి స్పందించిన కంగనా.. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాతే ఓటీటీ లోకి విడుదల చేస్తామని తెలిపింది. ఈ సినిమా తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, హిందీ వెర్షన్ నెట్ ప్లిక్స్ లు సొంతం చేసుకున్నాయని తెలిపింది. ఇక దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సినిమా విడుదలపై పుకార్లు చేస్తున్నారని తెలిపింది. నిజమేంటో తెలుసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మండిపడింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Bollywood queen, Jayalalitha film, Kangana Ranaut, Thalaivi film

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు