కలలు కనడం వేరుగా.. ఆ కలను నిజం చేసుకోవడం వేరు. కలను నిజం చేసుకోవాలంటే చాలా కష్టపడ్డాలి. అలా కష్టపడేవారికి కల సాకారమవుతుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంగనా రనౌత్. ఎందుకంటే.. ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనదైన గుర్తింపును సంపాదించుకుంది ఈ అమ్మడు. నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా ఇలా అన్నింట తన మార్క్నుక్రియేట్ చేస్తోంది. తాజాగా.. మరో అవతారం ఎత్తనుంది. కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. సరే!.. హీరోయిన్స్ వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అనేది మామూలు విషయమే అయినా, కంగనా మాత్రం తను చేస్తున్న పని గురించి చాలా ఎగ్జయిట్ అవుతుంది.
ఇంతకీ కంగనా రనౌత్ తను చేస్తున్న పని గురించి ఎందుకంతగా ఎగ్జయిట్ అవుతుంది. అంతలా ఎగ్జయిట్ అయ్యి కంగనా చేస్తున్న వ్యాపారమేంటి? అనే సందేహం కూడా రాకమానదు. వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి కంగనా స్వస్థలం. అక్కడ ఓ హోటల్ పెట్టాలనేది ఆమె కలట. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకుంటూ అడుగు వేసింది. మనాలిలో ఓ కేఫ్, రెస్టారెంట్ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసింది. ‘ఇది నా డ్రీమ్ వెంచర్. మీ అందరికీ ఈ ఆలోచనతో దగ్గరవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా కలను నిజం చేయడానికి సపోర్ట్ చేస్తున్న టీమ్‌కు ధన్యవాదాలు’ అని తెలియజేస్తూ టీమ్‌తో డిస్కస్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కంగనా. ఇంత బిజీ షెడ్యూల్లోనూ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకోవడం కంగనాకు ఎలా సాధ్యమవుతుందో అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
Sharing my new venture my dream with you all,something which will bring us closer,other than movies my other passion food, taking baby steps in to FnB industry,building my first cafe and restaurant in Manali, thanks to my terrific team dreaming of something spectacular. Thanks 🙏 pic.twitter.com/AJT0NVPAV2