• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD PRODUCER VIDHU VINOD CHOPRA GIVES CLARITY ABOUT PK AND MUNNABHAI MOVIES SEQUELS MS

PK Sequel: పీకే కు సీక్వెల్ పట్టాలెక్కుతుందా..? దర్శక నిర్మాతలేమంటున్నారంటే..

PK Sequel: పీకే కు సీక్వెల్ పట్టాలెక్కుతుందా..? దర్శక నిర్మాతలేమంటున్నారంటే..

పీకే చిత్రంలో రణ్బీర్, అమీర్ (ఫైల్)

AamirKhan Pk Sequel: పీకే చిత్రం క్లైమాక్స్ లో.. పని ముగించుకుని గ్రహాంతరవాసిగా తన గ్రహానికి వెళ్లిపోయిన అమీర్ ఖాన్ తర్వాత రణ్బీర్ కపూర్ ను తీసుకువస్తాడు. అక్కడే దర్శకుడు శుభం కార్డు వేసేశాడు. అయితే దాంతోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    AamirKhan Pk Sequel: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మాణ సారథ్యంలో 2014 లో వచ్చిన పీకే సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రజల్లో ఉన్న మత విశ్వాసాలు, మూఢ భక్తిని వాడుకుంటూ దొంగ బాబాలు వారిని ఎలా దోచుకుంటున్నారో తెలియజెప్తూ.. అంతర్లీనంగా హృద్యమైన ప్రేమకథతో దర్శకుడు హిరానీ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ఆ సమయంలో మత విశ్వాసాలను ప్రశ్నించినందుకు గానూ ఈ సినమాపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. అయితే అదే సమయంలో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నది.

    పీకే చిత్రం క్లైమాక్స్ లో.. తన పని ముగించుకుని గ్రహాంతరవాసిగా తన గ్రహానికి వెళ్లిపోయిన అమీర్ ఖాన్ తర్వాత రణ్బీర్ కపూర్ ను తీసుకువస్తాడు. అక్కడికే దర్శకుడు శుభం కార్డు వేసేశాడు. అయితే దాంతోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇదే విషయమై ఈ సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రా మీడియాతో మాట్లాడారు.

    విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ... ‘మేము ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తాం. సినిమా చివరలో రణ్బీర్ ను చూపించాం కాబట్టి చెప్పడానికి మాకు ఒక కథ ఉంది. అయితే ఆ కథను రచయిత అభిజాత్ ఇంకా రాయలేదు. అతడు రాసిన వెంటనే దీనిని సెట్స్ పైకి తీసుకెళ్తాం..’ అని చెప్పారు. కథ కుదిరితే అందులో రణ్బీర్ కపూరే హీరోగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    అంతేగాక పీకేతో పాటు మున్నాభాయ్ సినిమాకు సీక్వెల్ లు తీయాలని ఉందని చోప్రా అన్నారు. మున్నాభాయ్ రెండు భాగాలు భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఆ సినిమా హీరో సంజయ్ దత్ జైలు పాలు కావడంతో దానిని తిరిగి పట్టాలెక్కించలేదు. కానీ అదే కథను కొద్దిగా మార్చి పీకే తీశారని గతంలో వార్తలు కూడా వెలువడ్డాయి. కాగా.. చోప్రా మాట్లాడుతూ.. ‘మేము డబ్బు సంపాదించే వ్యాపారంలో లేము. సినిమాలు రూపొందించే పరిశ్రమలో ఉన్నాం. డబ్బు గురించి మేం ఆలోచించం. మున్నాభాయ్ సినిమాకు ఆరు నుంచి ఏడు, పీకే కు మూడు సీక్వెల్స్ తీయాలనుకుంటున్నాం. మేము డబ్బుల కంటే సంతోషాన్ని, ఆనందాన్ని మనశ్శాంతిని కోరుకుంటున్నాం..’ అని ఆయన తెలిపారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు