బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్..

Boney Kapoor: బాలీవుడ్ అగ్ర నిర్మాత.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే కుటుంబ సభ్యులకు కాదు కానీ ఆ ఇంట్లో పని చేసే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 6:11 PM IST
బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్..
కుటుంబ సభ్యులతో బోనీ కపూర్ ఫోటో (Instagram/Photo)
  • Share this:
బాలీవుడ్ అగ్ర నిర్మాత.. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే కుటుంబ సభ్యులకు కాదు కానీ ఆ ఇంట్లో పని చేసే వాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే అక్కడ పని చేసే చరణ్ సాహు అనే యువకుడికి కరోనా సోకింది. ఆయనకు సోకిందన్న విషయం తెలియగానే అంతా టెస్టులు చేయించుకున్నారు. అందులో బోనీతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు నెగిటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు చేసిన పరీక్షల్లో తాజాగా ఆ ఇంట్లో మరో ఇద్దరు పని మనుషులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

కుటుంబ సభ్యులతో బోనీ కపూర్ ఫోటో (Instagram/Photo)
కుటుంబ సభ్యులతో బోనీ కపూర్ ఫోటో (Instagram/Photo)


దాంతో బోనీ నివాసంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. బోనీ కపూర్ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో కలిసి ముంబయిలోని లోఖండ్‌వాలా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బోనీ ఇంట్లో కరోనా ఇప్పుడు అందర్నీ కంగారు పెడుతుంది. అయితే తాము జాగ్రత్తగానే ఉన్నామని బోనీ చెప్తున్నాడు.. కానీ ఇంట్లోనే కరోనా ఉండటంతో టెన్షన్ పడుతున్నారు అభిమానులు.

కుటుంబ సభ్యులతో బోనీ కపూర్ ఫోటో (Instagram/Photo)
కుటుంబ సభ్యులతో బోనీ కపూర్ ఫోటో (Instagram/Photo)


ఈ మధ్యే ఇంట్లో పని చేసే చరణ్ సాహు అనారోగ్యం పాలవడంతో కరోనా టెస్టు చేయగా అతడికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఇంట్లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా మరో ఇద్దరికి కూడా వ్యాధి సోకినట్టు గుర్తించారు. బోనీ, జాన్వీ, ఖుషీలకు వైద్య పరీక్షలో నెగెటివ్ వచ్చిందని వారి ప్రతినిధి తెలపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బోనీ, జాన్వీ, ఖుషీ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading