పగడాల డ్రెస్సులో పరువాల సన్నీలియోన్... కాస్ట్యూమ్ అదుర్స్...

Sunnyleone : ఇండియా స్టైల్ ఐకాన్లలో సన్నీలియోన్ స్పెషల్. ఆమె వేసుకునే డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ అన్నీ బ్రాండెడ్ లుక్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తాయి. తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్‌కి రెస్పాన్స్ అదిరిపోతోంది.


Updated: February 12, 2020, 1:56 PM IST
పగడాల డ్రెస్సులో పరువాల సన్నీలియోన్... కాస్ట్యూమ్ అదుర్స్...
పగడాల డ్రెస్సులో పరువాల సన్నీలియోన్... కాస్ట్యూమ్ అదుర్స్... (credit - insta - sunnyleone)
  • Share this:
Sunnyleone : పోర్న్ స్టార్ నుంచీ సినీ స్టార్‌గా మారిన సన్నీలియోన్... పాత్రలకు తగినట్లు ఒదిగిపోయేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె కాస్త లావైందనే విమర్శలు రావడంతో... అభిమానుల అంచనాలకు పూర్తి భిన్నంగా కనిపించింది సన్నీ లియోన్. రోజూ చూసే సన్నీయేనా... ఇంత స్లిమ్‌గా ఎలా అయిపోయింది అని అంతా అనుకునేలా చేస్తోంది ఈ రాగిణీ MMS సిరీస్ బ్యూటీ. బాలీవుడ్ ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే... సన్నీ లియోన్ కోసం ప్రత్యేక కాస్ట్యూమ్ రూపొందించారు. ఆ గార్జియస్ గౌన్‌లో తనకు చాలా నచ్చిందనీ... తాను మరింత అందంగా కనిపిస్తున్నానని తెలిపింది సన్నీ. సన్నీ కోసం స్వప్నిల్ షిండేతోపాటూ... ఫ్యాషన్ డిజైనర్లు హితేంద్ర కపోపారా, సమీర్ కటారియా కూడా ఈ డ్రెస్, స్టైల్, డిజైన్లకు సహకరించారు. అందరూ కలిసి తలో చెయ్యీ వేసి... అదిరిపోయే డ్రెస్ రెడీ చేశారు. ఇక... అయనా సిల్వర్ జ్యువెలరీ సంస్థ రూపొందించిన డైమండ్ రాక్స్‌లో మెరిసిపోతోంది సన్నీలియోన్. 

View this post on Instagram
 

Loved this so much! Thank you @officialswapnilshinde for this gorgeous gown! I felt so pretty in this... Styled by @hitendrakapopara assisted by @sameerkatariya92 Jewellery @ayanasilverjewellery big gorgeous diamond rocks for my ears! clutch @oceana_clutches (it’s not real feathers- fake feathers used on this vegan bag)


A post shared by Sunny Leone (@sunnyleone) on

ఐతే... కొంత మంది... సన్నీ లియోన్ చేతిలో ఉన్న బ్యాగులపై ఇదివరకు విమర్శలు చేశారు. ఏ కుందేలు చర్మంతోనో వాటిని చేసి ఉంటారని అన్నారు. ఈసారి కూడా అలా భావిస్తారని ముందే ఊహించిన సన్నీ లియోన్... తన చేతిలో వెగాన్ బ్యాగ్‌కి ఉన్నవి నిజమైన ఈకలు (feathers) కావనీ... అవి నకిలీ ఫెదర్స్ అనీ క్లారిటీగా చెప్పింది సన్నీ.
ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ బ్యూటీ సరికొత్తగా కనిపిస్తోందంటూ... ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు