Home /News /movies /

BOLLYWOOD POP SINGER YO YO HONEY SINGH WIFE SHILINI TALWAR ALLEGES SEXUAL HARASSMENT AND DOMESTIC VIOLENCE FILES PLEA IN COURT PK

Yo Yo Honey Singh: యోయో హనీసింగ్‌పై గృహ హింస, లైంగిక వేధింపుల కేసు పెట్టిన భార్య..

యోయో హనీసింగ్ (Yo Yo Honey Singh)

యోయో హనీసింగ్ (Yo Yo Honey Singh)

Yo Yo Honey Singh: బాలీవుడ్ గాయకుడు యోయో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ (Yo Yo Honey Singh) అతడిపై గృహ హింస, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. మానసికంగా వేధించాడని.. ఆర్థికంగానూ మోసం చేసాడని ఆమె ఆరోపించింది.

బాలీవుడ్ నటుడు, గాయకుడు యోయో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ అతడిపై గృహ హింస, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అంతేకాదు తనను మానసికంగా వేధించాడని.. ఆర్థికంగానూ మోసం చేసాడని ఆమె ఆరోపించింది. ఇదే ఆరోపణలతో ఈమె కేసు కూడా నమోదు చేసింది. ఈ మేరకు ఆమె ‘గృహ హింస నుంచి మహిళలను రక్షించే చట్టం’ కింద ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది షాలిని. ఆగస్టు 3న టిస్ హజారీ కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేసారు. ఈ కేసు నిమిత్తం హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ తరపున లాయర్స్ సందీప్ కపూర్, అపూర్వ పాండే, జిజి కశ్యప్ హాజరయ్యారు.

ఆగష్టు 28లోపు దీనికి సమాధానమివ్వాలంటూ కోర్టు హనీ సింగ్‌కు నోటీసు జారీ చేసింది. షాలిని తల్వార్‌కి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హనీ సింగ్ తన ఉమ్మడి ఆస్తిని వదులుకోవడాన్ని నిరోధించింది. 2014లో రియాలిటీ షో ఇండియాస్ రాక్ స్టార్ ఎపిసోడ్‌లో హనీ సింగ్ తన భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
yo yo honey singh,yo yo honey singh twitter,yo yo honey singh songs,yo yo honey singh wife,yo yo honey singh wife case,yo yo honey singh wife shalini files case against him,hindi cinema,యోయో హనీసింగ్,యోయో హనీసింగ్ భార్య గృహ హింస కేసు
యోయో హనీసింగ్ (Yo Yo Honey Singh)

ఉన్నట్లుండి ఈయన పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఇండియన్ పాప్ మ్యూజిక్‌లో యోయో హనీసింగ్ టాప్‌లో ఉన్నాడు. ఈయన పాటలకు వందల కోట్ల వ్యూస్ వస్తుంటాయి. సినిమాల్లోనూ యోయోకు మంచి ఫాలోయింగ్ ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema

తదుపరి వార్తలు