• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD NOTED ACTOR MAHABHARAT LORD INDRA FAME SATISH KAUL DIES DUE TO COVID 19 PK

Mahabharat Satish Kaul: కరోనాతో కన్నుమూసిన లెజెండరీ నటుడు.. ప్రముఖుల సంతాపం..

Mahabharat Satish Kaul: కరోనాతో కన్నుమూసిన లెజెండరీ నటుడు.. ప్రముఖుల సంతాపం..

కరోనాతో కన్నుమూసిన సతీష్ కౌల్ (Satish Kaul/Instagram)

Mahabharat Satish Kaul: మహాభారతం (Mahabharat) సీరియల్‌లో ఇంద్రుడి (Indra) పాత్రతో ఈయన చాలా గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్నేళ్లుగా ఈయన పంజాబ్‌లోని లుధియానాలో ఒక చిన్న ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. అక్కడే ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయాడు సతీష్(Satish Kaul).

  • Share this:
కరోనా వైరస్ ఇండస్ట్రీలో ప్రముఖులను తీసుకెళ్లిపోతూనే ఉంది. ఇప్పుడు కూడా మరో ప్రముఖ నటుడు ఈ వైరస్ కారణంగా బలైపోయాడు. బాలీవుడ్ నటుడు సతీష్ కౌల్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. బిఆర్ చోప్రా తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ సీరియల్ మహాభారతంలో ఈయన ఇంద్రుడిగా నటించాడు. సీరియల్స్‌తో పాటు కొన్ని హిందీ సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు సతీష్ కౌల్. కొన్ని రోజులుగా ఈయన కోవిడ్ -19తో బాధ పడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో మరణించారు. ఆయన వయసు 74. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈయనకు ఇండస్ట్రీ బాసటగా నిలిచింది. లాక్‌డౌన్ చాలా మందికి చెప్పుకోలేని కష్టాలను తీసుకొచ్చింది. అలాగే సతీష్ కౌల్ కూడా చాలా ఇబ్బందులే పడ్డాడు. బాలీవుడ్‌లో 300 సినిమాలకు పైగా నటించిన ఈయన కొన్ని రోజులుగా కరోనాతో బాధ పడ్డాడు. మహాభారతం సీరియల్‌లో ఇంద్రుడి పాత్రతో ఈయన చాలా గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్నేళ్లుగా ఈయన పంజాబ్‌లోని లుధియానాలో ఒక చిన్న ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు.

అక్కడే ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయాడు సతీష్. ఈయన పరిస్థితి తెలుసుకుని కపిల్ శర్మ ఆర్థిక సాయం కూడా చేసాడు. కొన్ని రోజులుగా సతీష్ కౌల్ కనీసం నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేసే స్థితిలో లేడని సన్నిహితులు చెప్పారు.

నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)


నటుడిగా తనకు ఎంతో ప్రేమ, ఆశీర్వాదాలు లభించాయని గుర్తు చేసుకున్నాడు సతీష్ కౌల్. మహాభారతంతో పాటు సుమారు 300 హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించాడు ఈయన. వాటిలో ప్యార్ తో హోనాహి థా, కర్మ, ప్రేమ్ పర్బాట్, వారెంట్, గునాహో కా ఫైస్లా, భక్తి మీ శక్తి, డాన్స్ డాన్స్, రామ్ లఖన్, ఆంటీ నెంబర్ 1, విక్రమ్ బేటల్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో జరిగిన చిన్న సంఘటన వల్ల పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయాడు సతీష్ కౌల్.

నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)
నటుడు సతీష్ కౌల్ (satish kaul indra in mahabharat)


2019లో సతీష్ కౌల్ పరిస్థితిని గమనించిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల తర్వాత కౌల్ ముంబై నుంచి పంజాబ్ వెళ్లి 2011లో ఒక యాక్టింగ్ స్కూల్ ప్రారంభించినా కూడా అది పెద్దగా వర్కవుట్ కాలేదు.


ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేట్ అయిన సతీష్ కౌల్ సెప్టెంబర్ 26, 1948న కాశ్మీర్‌లో జన్మించాడు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, షత్రుఘన్ సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా మరియు ఓం పూరి ఎఫ్‌టిఐఐలో అతని బ్యాచ్ మేట్స్. ఈయన మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: