Home /News /movies /

BOLLYWOOD MOVIE ON PRIME MINISTER ATAL BIHARI VAJPAYEE LIFE ANNOUNCED SB

Atal Bihari Vajpayee: వాజ్‌పేయిపై సినిమా... తెరపైకి మాజీ ప్రధాని జీవితకథ..

అటల్ బీహారి వాజ్ పేయి

అటల్ బీహారి వాజ్ పేయి

భారతీయ చరిత్రలోని గొప్ప నాయకులలో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఒకరు. ఈ సినిమాలో ఆయన రాజకీయ సిద్ధాంతాలనే కాక మానవీయ, కవితా కోణాల్ని ఆవిష్కరిస్తామని వినోద్ పేర్కొన్నారు. 

    మరో మహానేత బయోపిక్ రానుంది. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రులు, స్వాతంత్య్ర సమరయోధులు, క్రీడాకారులు, ఉద్యమకారులు ఇలా అనేక మంది మహానుభావుల జీవితాల్ని వెండితెరకెక్కించారు. తాజాగా భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) జీవితకథ త్వరలో సినిమాగా తెరపైకి రానుంది.

    ప్రముఖ రచయిత ఉల్లేఖ్‌ ఎన్‌.పి రచించిన 'ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయీ: పొలిటీషియన్‌ అండ్‌ పారడాక్స్‌' (The Untold Vajpayee) పుస్తకాధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. తాజాగా ఈ పుస్తక హక్కులను దక్కించుకున్నట్లు నిర్మాతలు వినోద్‌ భానుషాలి (Vinod Bhanushali), సందీప్‌ సింగ్‌(Sundeep Singh) ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత వినోద్‌ మాట్లాడుతూ.. ''వాజ్‌పేయీకి నేను వీరాభిమానిని. మన దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అని పేర్కొన్నారు. అందుకే ఆయన వారసత్వాన్ని వెండితెరపైకి తీసుకురావడాన్ని మేము గొప్ప గౌరవంగా భావిస్తున్నాం'' అన్నారు.



    ఇక 'భారతీయ చరిత్రలోని గొప్ప నాయకులలో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఒకరు. ఈ సినిమాలో ఆయన రాజకీయ సిద్ధాంతాలనే కాక మానవీయ, కవితా కోణాల్ని ఆవిష్కరిస్తామని వినోద్ పేర్కొన్నారు.  ప్రస్తుతం వాజ్‌పేయీ పాత్ర పోషించగల నటుడి కోసం వెతుకుతున్నాం. త్వరలో ఈ చిత్ర దర్శకుడ్ని ప్రకటిస్తాం. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా 2023 క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు మరో నిర్మాత సందీప్‌ సింగ్‌.

    అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25 మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bjp, PM Narendra Modi Biopic, Vajpayee

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు