సినిమా వాళ్ల ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ ఈ మధ్య బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి కాల్స్ వచ్చిన ప్రతీసారి పోలీసులు అప్రమత్తమవుతున్నారు. అప్పటికప్పుడు బాంబు స్క్వాడ్లతో వెళ్లి ఏం లేదని తేల్చేస్తున్నారు. కొందరు ఆకతాయీలు కావాలనే పోలీసులతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇంటి విషయంలోనూ ఇదే జరిగింది. ముంబైలోని ఈయన ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. కేవలం అమితాబ్ ఇంటిని మాత్రమే కాదు.. ముంబైలోని మరో మూడు రైల్వే స్టేషన్స్‌లో కూడా బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.
బాంబ్ స్వాడ్లతో వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన ప్రతీ చోటును కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. అలాగే అమితాబ్ బచ్చన్ ఇంటిని కూడా అణువణువు తనిఖీ చేసారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. అయితే అందులో పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద విస్పోటకాలు కానీ.. వస్తువులు కానీ దొరకలేదు. దాంతో అది ఫేక్ కాల్స్ అని నిర్ధారించుకున్నారు పోలీసులు. ఇలాంటి కాల్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తుండటంతో వాటిపై ఫోకస్ చేసారు ముంబై పోలీసు సంస్థ.
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆగంతకుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు.. జుహులోని నటుడు అమితాబ్ బంగ్లా దగ్గర బాంబులు పెట్టామని తెలిపారు. దాంతో ఈ భద్రత చర్యలు చేపట్టారు. బాంబులు లేవని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోనూ ఇలాంటి ఫేక్ కాల్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ విజయ్, అజిత్, రజినీకాంత్ ఇంటి దగ్గర బాంబులు పెట్టామంటూ గతంలో కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విషయంలోనూ ఇదే జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Hindi Cinema