అమితాబ్‌కు అనారోగ్యం.. కంగారు పడుతున్న అభిమానులు..

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఈయనకు ఏమైంది.. నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నాడు.. పైగా కొరటాల శివ సినిమాతో ఎంచక్కా బిజీ అయిపోయాడు కదా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 11, 2019, 3:16 PM IST
అమితాబ్‌కు అనారోగ్యం.. కంగారు పడుతున్న అభిమానులు..
హాస్పిటల్లో అమితాబ్ బచ్చన్
  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఈయనకు ఏమైంది.. నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నాడు.. పైగా కొరటాల శివ సినిమాతో ఎంచక్కా బిజీ అయిపోయాడు కదా.. అంతలోనే ఏమైంది అనుకుంటున్నారా..? ఇక్కడ మెగాస్టార్ అంటే మన మెగాస్టార్ కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈయన కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరం కానున్నాడు. దానికి కారణం అనారోగ్యమే.. వయసు మీద పడటంతో అమితాబ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.

Bollywood Megastar Amitabh Bachchan hospitalized due to heavy work without rest pk నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఈయనకు ఏమైంది.. నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నాడు.. పైగా కొరటాల శివ సినిమాతో ఎంచక్కా బిజీ అయిపోయాడు కదా.. Amitabh Bachchan,Amitabh Bachchan twitter,Amitabh Bachchan health,Amitabh Bachchan health condition,Amitabh Bachchan movies,Amitabh Bachchan hospital,Amitabh Bachchan in hospital bed,Amitabh Bachchan instagram,Amitabh Bachchan hospitalized,Amitabh Bachchan no rest,megastar Amitabh Bachchan,hindi cinema,అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ సినిమాలు,అమితాబ్ బచ్చన్ అనారోగ్యం,అమితాబ్ బచ్చన్ హాస్పిటల్,హిందీ సినిమా
అమితాబ్ బచ్చన్ (File Photo)


చాలా రోజులుగా ఈయన టీబీ, లివర్ సంబంధిత వ్యాధులతో కూడా బాధ పడుతున్నాడు. ఇలాంటి సమయంలో అలసత్వంతో ఈయన హాస్పిటల్ పాలయ్యాడు. కొన్ని రోజుల పాటు సినిమాలే కాదు.. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఇదే పని చేస్తున్నాడు బిగ్ బి. ఆయన మళ్లీ సినిమాల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఇఫ్పుడు ఆయన షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులకు షాక్ ఇచ్చింది. కాలికి సాక్స్ వేసుకుని మంచంపై అలా పడుకున్నాడు అమితాబ్.ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అమితాబ్ గారూ.. మీ ఆరోగ్యానికి ఏం కాదు.. మేమంతా మీ వెంటే ఉన్నామంటూ ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అది చూసి బిగ్ బి కూడా రిప్లై ఇస్తున్నాడు. అంతా బాగానే ఉంది.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలుద్దాం అంటున్నాడు. 70 దాటిన తర్వాత సినిమాల జోరు ఇంకా పెంచేసాడు. అందుకే అసలటతో అనారోగ్యం బారిన పడ్డాడు మెగాస్టార్.ఈ మధ్యే కోల్ కత్తా ఇంటర్నేషనల్ ఫిలింపెస్టివల్స్‌కి కూడా ఆయన రావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా రాలేకపోయానని అమితాబ్ వెల్లడించారు. అయితే అవన్నీ తర్వాత.. ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి అమితాబ్ అనారోగ్యం బారిన పడటంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: November 11, 2019, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading