హోమ్ /వార్తలు /సినిమా /

మనకు బాగా తెలిసిన ఈ స్టార్ హీరో ఎవరో కాస్త గుర్తు పట్టండి.. షూటింగ్‌కు ఇలా వెళ్తున్నాడు.!

మనకు బాగా తెలిసిన ఈ స్టార్ హీరో ఎవరో కాస్త గుర్తు పట్టండి.. షూటింగ్‌కు ఇలా వెళ్తున్నాడు.!

బాలీవుడ్ మెగాస్టార్

బాలీవుడ్ మెగాస్టార్

ఇక్కడ మరీ ఏలియన్ మాదిరి రెడీ అయి షూటింగ్‌కు వెళ్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..? మరోసారి తీక్షణంగా చూస్తే మనకే అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం ఆయన్ని. పైగా ఆయన మెగాస్టార్ కూడా. ఆయనెవరో తెలిసిందా..?

ఇక్కడ మరీ ఏలియన్ మాదిరి రెడీ అయి షూటింగ్‌కు వెళ్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..? మరోసారి తీక్షణంగా చూస్తే మనకే అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం ఆయన్ని. పైగా ఆయన మెగాస్టార్ కూడా. అంటే మన చిరంజీవి కాదండీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అక్కడున్నది ఆయనే. 70 దాటిన తర్వాత కూడా ఈయన జోరు చూస్తుంటే వారెవ్వా అనాల్సిందే. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు అమితాబ్. మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నా కూడా ఎప్పుడూ పని మాత్రం ఆపడం లేదు బిగ్ బాస్. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ కాస్త కుదుట పడిన తర్వాత వెంటనే పని మొదలు పెడుతున్నారు. షూటింగ్‌కు వచ్చేసి స్టార్ట్ యాక్షన్ అంటున్నారు మెగాస్టార్. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా పని చేస్తున్నారు అబితాబ్ బచ్చన్. కరోనా కాలంలోనూ షూటింగ్స్‌కు వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు అమితాబ్. గతేడాది అమితాబ్ బచ్చన్‌తో పాటు కుటుంబమంతా కరోనా వచ్చింది. అయినా కూడా త్వరగానే కోలుకున్నారు.

మొన్న ఎప్రిల్ నుంచి కరోనా మళ్లీ విజృంభించడంతో కాస్త విశ్రాంతి తీసుకున్న ఈయన.. ఇప్పుడు మళ్లీ షూటింగ్స్‌కు బయల్దేరారు. నిబంధనలతో ముంబైలో సినిమాల షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు. దీంతో బిగ్ బి తన షూటింగ్ కోసం రెడీ అయిపోయారు. తన సోషల్ మీడియాలో మాస్క్ ధరించి కారులో కూర్చొని దిగిన ఫొటోని షేర్ చేస్తూ పోజిచ్చారు.


ఉదయం 7 గంటలు.. పనికి వెళ్లేందుకు డ్రైవింగ్.. లాక్‌డౌన్ 2.0 తర్వాత తొలి రోజు షూటింగ్ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు పాంగోలిన్ మాస్క్‌ పెట్టుకున్నారు ఈయన. ఇకపై ప్రతీరోజూ మరింత మెరుగ్గా ఉండబోతోంది.. అని తెలిపారు. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్- 13 షూటింగ్‌లో పాల్గొనేందుకు అమితాబ్ వెళుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బి జోరు చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలిస్తున్నారు.

First published:

Tags: Amitabh bachchan, Bollywood, Hindi Cinema

ఉత్తమ కథలు