రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి.. కూతురుకు దక్కని కడసారి చూపు..

Rishi Kapoor Funeral: బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ అంత్యక్రియలు నిరాడంబరంగా పూర్తయ్యాయి. ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో ఈయన అంత్యక్రియలు నిర్వహించారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 30, 2020, 6:42 PM IST
రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి.. కూతురుకు దక్కని కడసారి చూపు..
రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)
  • Share this:
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ అంత్యక్రియలు నిరాడంబరంగా పూర్తయ్యాయి. ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో ఈయన అంత్యక్రియలు నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎలాంటి సందడి లేకుండా ఈయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. చనిపోయిన వెంటనే హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు నేరుగా తీసకొచ్చి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసారు కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహాన్ని చూడ్డానికి ఎవరూ రావద్దని ముందుగానే రిషి భార్య నితూ కపూర్ సూచించింది. దాంతో ఎవరూ రాలేదు.. అయితే రిషికి అత్యంత సన్నిహితులు అయిన కొందరు మాత్రం చందన్ వాడి స్మశాన వాటికకు వచ్చి నివాళులు అర్పించారు.

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)
రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)

రణ్‌బీర్ కపూర్ తన తండ్రి చితికి తలకొరివి పెట్టాడు. లాక్‌డౌన్ లేకపోయుంటే ముంబై వీధులన్నీ ఆయన అభిమానులతో నిండిపోయేవి. ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు కూడా సాధారణంగానే జరిగాయి. ఇప్పుడు రిషి కపూర్ అలాగే జరిగాయి. కపూర్ ఫ్యామిలీ నుంచి కొందరు.. ఇండస్ట్రీలో మరికొందరు మాత్రం వచ్చారు.

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)
రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)

అందులో రిషి కపూర్ భార్య నీతూ కపూర్, సోదరి రిమా జైన్, మనోజ్ జైన్, అర్మాన్ జైన్, ఆదర్ జైన్, అనిషా జైన్, రాజీవ్ కపూర్, రణ్‌ధీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, డాక్టర్ తరంగ్, అయాన్ ముఖర్జీ, జైరామ్, రోహిత్ ధావన్, రాహుల్ రావైల్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే రిషి కపూర్ కుమార్తె రిధిమా కపూర్ మాత్రం అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)
రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి (rishi kapoor funeral)

తండ్రి కడసారి చూపుకు ఆమె నోచుకోలేకపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. లాక్‌డౌన్ కారణంగా రాలేకపోయారు. మరికొన్ని గంటల్లో ఆమె ముంబై వస్తుంది. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న ఆమె కారులో ఢిల్లీ నుంచి బయలుదేరింది. రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతోన్న రిషి కపూర్.. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో ఎప్రిల్ 30న ఉదయం తుదిశ్వాస విడిచారు.
Published by: Praveen Kumar Vadla
First published: April 30, 2020, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading