• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD KATRINA KAIF IN RED SPORTS BRA AND TIGHTS DOES PILATES IS SETTING FITNESS GOAL WATCH VIDEO SRD

Katrina Kaif : రెడ్ స్పోర్ట్స్ బ్రా తో జిమ్ లో వర్క్ ఫుట్స్ చేస్తున్న కత్రినా కైఫ్..వైరల్ వీడియో

Katrina Kaif : రెడ్ స్పోర్ట్స్ బ్రా తో జిమ్ లో వర్క్ ఫుట్స్ చేస్తున్న కత్రినా కైఫ్..వైరల్ వీడియో

Katrina Kaif

Katrina Kaif : బాలీవుడ్ న‌టి క‌త్రినాకైఫ్ జిమ్ వ‌ర్క‌వుట్ సెష‌న్ ను మొద‌లుపెట్టింది. జిమ్ లో ఓ వైపు క‌స‌రత్తులు చేస్తూనే.. మ‌రోవైపు త‌న ఫాలోవ‌ర్లు, అభిమానులు ఫిట్ నెస్ మంత్ర ఎలా ఫాలో కావాలో చెప్తోంది.

  • Share this:
    బాలీవుడ్ న‌టి క‌త్రినాకైఫ్ జిమ్ వ‌ర్క‌వుట్ సెష‌న్ ను మొద‌లుపెట్టింది. జిమ్ లో ఓ వైపు క‌స‌రత్తులు చేస్తూనే.. మ‌రోవైపు త‌న ఫాలోవ‌ర్లు, అభిమానులు ఫిట్ నెస్ మంత్ర ఎలా ఫాలో కావాలో చెప్తోంది. ఫిట్ గా ఉండేందుఉ ప్ర‌స్తుతం పైలేట్స్ వ‌ర్క‌వుట్ చేస్తోంది. బ్యాక్ డ్రాప్ లో వెస్ట‌ర్న్ స్టైల్ మ్యూజిక్ ప్లే అవుతుండ‌గా.. క‌త్రినా పైలేట్స్ లెగ్ వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వీడియోలో చూడొచ్చు. ఫిట్ నెస్ ట్రైన‌ర్ యాస్మిన్ క‌రాచివాలా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ వీడియో రెడ్ స్పోర్ట్స్ బ్రా తో కత్రినా చేస్తున్న వర్క్ ఫుట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయ్. " బద్ధకంగా ఉండే వాళ్లు చేసే వర్కఫుట్స్ ఇవి..15 ఏళ్లుగా బతిమాలాడితే కత్రినా కైఫ్ ఇప్పుడు పైలెట్స్ చేస్తోంది " అంటూ క్యాప్షన్ పెట్టింది యాస్మిన్ కరాచివాలా. ఈమె కత్రినా కైఫ్ పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్. యాస్మిన్ తో పాటు ఈ వీడియో కత్రినా కూడా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. తిరిగి నాజూకు షేప్ పొందేందుకే ఈ వర్క్ ఫుట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల క‌త్రినా త‌న సోద‌రి ఇజాబెల్లే కైఫ్, కోస్టార్ విక్కీ కౌశ‌ల్ తో క‌లిసి ఇటీవ‌లే న్యూఇయ‌ర్ ను సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ ఫొటో కూడా నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టింది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సూర్య‌వంశి చిత్రంలో న‌టిస్తోంది. విక్కీ కౌశ‌ల్ తో ఫోన్ బూత్ లో న‌టిస్తోంది.

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌.. ద‌క్షిణాదిలో ఇప్ప‌టి వ‌రుకు మూడు సినిమాల్లో మాత్ర‌మే కనిపించింది. అందులో రెండు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తే మ‌రో సినిమాలో గెస్ట్ పాత్ర‌లో మెప్పించింది. అది కూడా కెరీర్ ప్రారంభంలోనే. త‌ర్వాత ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం అక్క‌డే ఫుల్ బిజీగా మారిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇంత‌కీ ఆమె చేసిన మూడు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలే కావ‌డం విశేషం. అందులో ఒక‌టి విక్ట‌రీ వెంక‌టేశ్‌తో చేసిన‌ మ‌ల్లీశ్వ‌రి. ఈ సినిమా సూప‌ర్‌హిట్ అయ్యింది. త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అల్ల‌రి పిడుగు సినిమాలో న‌టించింది. ఈ సినిమా ఏమో డిజాస్ట‌ర్ అయ్యింది. త‌ర్వాత మ‌రో మ‌ల‌యాళ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది.











    View this post on Instagram






    A post shared by Katrina Kaif (@katrinakaif)





    లేటెస్ట్ గా తమిళ స్టార్ విజయ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఈ ముద్దుగుమ్మ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో అంధాదున్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ శ్రీరామ్ రాఘ‌వ‌న్ భారీ సినిమాను ప్లాన్ చేశాడు. అందులో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. ఈయ‌న జోడీగా క‌త్రినా కైఫ్‌ను న‌టింప చేయ‌డానికి ఒప్పించారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై క‌త్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు