Home /News /movies /

BOLLYWOOD ITEM BOMB RAKHI SAWANT IN SPIDER WOMAN GETUP AND SHE DEMANDS TO BE INVITED TO BIGG BOSS OTT NGS

Bigg Boss: బిగ్ బాస్ లోకి ఆహ్వానించాలని డిమాండ్.. రోడ్డుపైకి వచ్చి ఏం చేసిందో చూడండి..

బిగ్ బాస్ లోకి తీసుకోవాలని డిమాండ్

బిగ్ బాస్ లోకి తీసుకోవాలని డిమాండ్

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే అదంతా ఓ తతంగం.. కానీ ఓ బ్యూటీ మాత్రం తనను బిగ్ బాస్ లోకి తీసుకోవాలని నిర్వాహకులను డిమాండ్ చేస్తోంది. అందుకోసం ఏం చేసిందో తెలుసా..?

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది బిగ్ బాస్ షో.. అందుకే ఈ షోకు ఎనలేని క్రేజ్ ఉంటోంది. హీరోయిన్ల నుంచి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిన వారంతా బిగ్ బాస్ లోకి వెళ్లాలని కోరుకుంటారు. అందుకు పలు రకాలుగా వివాదాల్లో ఉండడమో.. లేక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎదో ఒకరకంగా ఫ్యాన్ ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా బిగ్ బాస్ లోకి తనను ఆహ్వానించాలని బాలీవుడ్ నటి రాఖీ సావత్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. రాఖీ సావంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడినా అది వివాదం కావాల్సిందే.. వివాదాలు ఎక్కడ ఉన్నాయి అని అతి వెతికీ మరి తలదూర్చడం ఈ ఐటెం బాంబ్ రాఖీకి బాగా అలావాటు..

    ఆమె తాజాగా స్పెడర్ ఉమెన్ గా మారి.. రోడ్డుపై హల్ చల్ చేసింది. కొంతమందిని భయపెట్టింది. మరికొందర్ని ఎంటర్ టైన్ చేసింది. ఇంతకీ ఎందుకిలా చేస్తున్నావమ్మడు అంటే ఆమె చెప్పిన సమాధానం చూసి అంతా షాక్ కు గురయ్యారు. నిత్యం వివాదాల్లో ఉండే సార్ట్స్ తో కూడా కావాలని గొడవ పడుతూ పబ్లిసిటీ కొట్టేయడం కూడా ఈ ఆటం బాంబ్ కే చెల్లుతుంది. ఈ మధ్య కాస్త వివాదాలను పక్కకు పెట్టిన రాఖీ ఇప్పుడు ఏకంగా స్పైడర్ విమెన్ అవతరమెత్తి రోడ్ మీదకి చేరి హల్చల్ చేసింది. తనను బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

    మంగళవారం ఉదయం నుంచి స్పైడర్ మ్యాన్ బట్టలు ధరించి ముంబై వీధుల్లో తిరుగుతూ హంగామా చేసింది ఈ ఐటెం భామ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్పైడర్ మ్యాన్ అవతారంలో సూట్‌కేస్‌తో పాటు రోడ్ల మీద వయ్యారాలు పోతూ డాన్స్ చేసింది. తనను బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. పెద్ద స్పీకర్‌తో పాటు ఆమె పాటలు ప్లే చేసి అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. తాను రాఖీని కాదని.. స్పైడర్-ఉమెన్ అని స్పైడర్ వెబ్‌లతో తన ప్రత్యర్థులను నాశనం చేస్తానని బిగ్ బాస్‌కు తన మనసులో్ మాట చెప్పింది. 

    మరొక వీడియోలో సల్మాన్ ఖాన్ పాడిన బిగ్ బాస్ థీమ్ సాంగ్‌లో రాఖీ డ్యాన్స్ చేసింది. రాఖీ వినోదాత్మక చేష్టలు అభిమానులను ఆకర్షించగా.. రాఖీ ఇటీవల తాను ఇంకా బిగ్ బాస్ ఓటీటీకి ఆహ్వానించలేదని బాధపపడుతూ ఒక వీడియోను షేర్ చేసింది. బిగ్ బాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ ఎప్పుడూ షోలో భాగస్వామిగా ఉంటానని వాగ్దానం చేసిందని రాఖీ అంటోంది. సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వోట్‌ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. అందుకే ఆమె ఇలా హంగమా చేసింది.http://






    రాఖీ ఫోటోలు, వీడియో చూసి నెటిజన్లు అంతా పాపం రాఖీని తీసుకోండి బిగ్ బాస్ అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Bigg Boss, Bollywood, Bollywood hot heroines, Rakhi Sawant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు