news18-telugu
Updated: July 26, 2019, 5:42 PM IST
బాలీవుడ్ భామలు (ట్విట్టర్ ఫోటోస్)
స్మార్ట్ఫోన్ల వాడకం అంతకంతకు పెరిగిపోవడం, సరసమైన ధరల్లో డేటా అందుబాటులోకి రావడం వంటి వాటితో యూట్యూబ్ వాడకం రోజురోజుకి పెరుగుతోంది. దేశంలోని అన్ని ఏజ్ గ్రూప్‌ల్లో 80 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్‌ను వాడుతున్నట్టు గూగుల్ ఇండియా తెలిపింది. యూత్ ఎక్కువగా అనుసరించే కీలక మాధ్యమాలు ఇవే కావడంతో ఇప్పుడు సెలబ్రిటీలు అదే బాటలో వెళుతున్నారు. ఫేస్ బుక్ .. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్.. టిక్ టాక్ లతో పాటు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు ప్రారంభించి వాటిలో తమ వృత్తిగత వ్యక్తిగత వ్యవహారాలపై పోస్టింగులు పెడుతున్నారు. క్రేజు ఉన్న స్టార్లకు కోట్లలో అభిమానులు ఫాలో అవుతున్నారు.
సరిగ్గా ఇలాంటి వాటిని బేస్ చేసుకొని కొంతమంది బాలీవుడ్ కధానాయికలు విలువైన అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా- యూట్యూబ్ లో పోస్టింగుల ద్వారా రెవెన్యూను సంపాదిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు యూట్యూబ్ చానెల్స్ తో పాటు సామాజిక మాధ్యమాల్లో స్పీడ్ గా ఉన్నారు. టాలీవుడ్లో ఈ ట్రెండ్ తక్కువే అయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్లు ఎంతో అడ్వాన్స్ గా ఉన్నారు.

బాలీవుడ్ భామలు ‘కియారా అద్వానీ,మలైక అరోరా,కఈతి సనన్ (ఫైల్ ఫోటోస్)
బాలీవుడ్ భామలు సైతం యూట్యూబ్ లో యమ స్పీడ్‌గా ఉన్నారు. బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే స్టార్ట్ అప్ బిజినెస్ ని సామాజిక మాధ్యమాలు .. యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం వల్ల కోట్లాది రూపాయల బిజినెస్ సులువుగా సాగిపోతోంది. యంగ్ బ్యూటీ ఆలియా భట్ సైతం సామాజిక మాధ్యమాలతో పాటు యూట్యూబ్ చానెల్ ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. తద్వారా లక్షలు.. కోట్లలో ఆదాయం కలిసి రానుంది ఈ బ్యూటీకి. తాజాగా ఆలియా బాటలోనే మరో హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. `బాలీవుడ్ జర్నీలో నేర్చుకున్న కొత్త విషయాలను నా యూట్యూబ్ చానెల్ లో పంచుకుంటానని చెప్పింది. ముఖ్యంగా ఫిట్నెస్-బ్యూటీ టిప్స్ ని షేర్ చేస్తాను. పరిశ్రమలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వారితో స్ఫూర్తి నిచ్చే కథల్ని వెలికి తీస్తాను అని చెబుతోంది జాక్వెలిన్. తాజాగా 'కబీర్ సింగ్' లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ సైతం, తను నటించిన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ద్వారానే పేరుతెచ్చుకున్నానని తెలపడం విశేషం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 26, 2019, 5:42 PM IST