బాలీవుడ్‌కు హిస్టరీ ఫీవర్: చరిత్రపై మనుసు పడుతున్న హీరోలు

అక్షయ్ కుమార్,రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గణ్

కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో చారిత్రక నేపథ్యమున్న సిన్మాలను తెరకెక్కించడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.

 • Share this:
  కొన్నేళ్లుగా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో చారిత్రక నేపథ్యమున్న సిన్మాలను తెరకెక్కించడానికి మూవీ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’ మూవీ బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీపికా,రణ్‌వీర్, షాహిద్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ మూవీ రూ.300 కోట్ల వసూళ్లను సాధించింది.  అంతకు ముందు భన్సాలీ దర్శకత్వంలో ..రణ్‌వీర్, దీపికా, ప్రియాంక చోప్రాలతో తెరకెక్కిన ‘బాజీరావు మస్తానీ’ కూడా బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిన విషయమే కదా. మరోవైపు తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక సిన్మాతో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసిన క్రిష్...ఇపుడు కంగనా రనావత్ హీరోయిన్’గా ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ టైటిల్‌తో బయోపిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

  మరోవైపు చిరంజీవి కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితంపై ‘సైరా..నరసింహారెడ్డి’ మూవీ చేస్తున్నాడు. ఇంకోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్..మరాఠా యోధుడు శివాజీ దగ్గర సుబేదార్ గా పనిచేసిన తానాజీ జీవితంపై ‘తానాజీ’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

  తానాజీ మూవీలో అజయ్ దేవ్‌గణ్


  లేటెస్ట్‌గా అజయ్ దేవ్‌గణ్.. భారత దేశ చరిత్రలో నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన చాణుక్యుడి జీవితంపై తెరకెక్కే ‘చాణక్య’ మూవీలో టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. నీరజ్ పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

  మరోవైపు అజయ్ దేవ్‌గణ్ తోటి హీరో అక్షయ్ కుమార్ కూడా 1897ల పాకిస్థాన్ లున్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ‘కేసరి’ అనే బయోపిక్ మూవీ చేస్తున్నాడు. అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కరణ్ జోహార్‌తో కలిసి అక్షయ్ కుమారే నిర్మిస్తున్నాడు. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కిస్తున్నారు.  21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ మూవీ స్టోరీ. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీటైంది. ఈ మూవీలో అక్షయ్ సరసన పరిణీతి చోప్రా కథానాయికగా నటించింది.  మూవీని వచ్చే యేడాది మార్చి 21న రిలీజ్ చేయనున్నారు.

  AkshayKumar's Kesari Movie Shooting Wrapup
  కేసరి మూవీలో అక్షయ్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)


  ‘కేసరి’ మూవీతో పాటు అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కోతున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యశ్ రాజ్ పిల్మ్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తోంది.

  మరోవైపు హృతిక్‌తో ‘జోదా అక్బర్’, ‘మొహంజోదారో’ వంటి హిస్టారికల్ మూవీస్ తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్...ఇపుడు సంజయ్ దత్, అర్జున్ కపూర్‌లతో మూడో పానిపట్టు యుద్ధ నేపథ్యలో ‘పానిపట్’ అనే యుద్ధ నేపథ్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఇంకోవైపు రణ్‌బీర్ కపూర్ కూడా యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో కరణ్ మల్మోత్ర డైరెక్షన్‌లో ‘షంషేరా’ అనే మూవీ చారిత్రక నేపథ్యమున్న సినిమానే చేస్తున్నాడు.  ఇంకోవైపు కరణ్ జోహార్ ఆయన స్వీయ దర్శకత్వంలో...మొఘల్ సింహాసనం కోసం జరిగిన యుద్ధ నేపథ్యంలో ‘తఖ్త్’అనే చారిత్రక నేపథ్యమున్న సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వారసత్వం..ప్రేమ..ద్రోహం అనే ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సోదరి జహనారా బేగం పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఈ మూవీలో కథానాయికలుగా ఆలియా భట్, జాన్వీ కపూర్‌లు నటిస్తున్నారు.  ఇప్పటికే ‘పద్మావత్’ మూవీలో అల్లావుద్దీన్ ఖీల్జీగా విలనిజాన్ని పండించిన రణ్‌వీర్ ఇపుడు ఔరంగజేబుగా ఎలాంటి విలనిజాన్ని ‘తఖ్త్’మూవీలో ప్రదర్శిస్తాడో చూడాలి. మొత్తానికి బాలీవుడ్ మొత్తం హిస్టరీ మేనియాతో ఊగిపోతుంది.


  ఇది కూడా చదవండి 

  జనసేన ‘గాజు గ్లాస్‌’పై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్

  వినయ విధేయ రాముడి సాక్షిగా చిరంజీవి-త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్..

  రేటులో రిబేటు.. రవితేజకు కావాలి ఒక్క హిట్టు
  First published: