• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD HEROINES WHO CAMES TO TOLLYWOOD FOR PAN INDIA FILMS NR

Bollywood heroines: బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి చేరిన హాట్ హీరోయిన్లు.. అక్కడ అన్నీ ఉన్నా?

Bollywood heroines: బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి చేరిన హాట్ హీరోయిన్లు.. అక్కడ అన్నీ ఉన్నా?

Bollywood heroines

Bollywood heroines: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తానికి బాలీవుడ్ ను దింపేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ.

  • Share this:
    Bollywood heroines: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తానికి బాలీవుడ్ ను దింపేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న తరుణంలో టాలీవుడ్ కు ఓ క్రేజ్ వచ్చేసింది. బాలీవుడ్ నటులంతా టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలను తమ దర్శకత్వంలో చేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ తెగ క్యూ కడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టారు.

    ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలలో పలువురు బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికే కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, కియారా అద్వానీ ఇలా పలువురు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువగా ఈ ముంబై భామలనే చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీ ఖాన్ కృతి సనన్, ఊర్వశి రౌతెలా.. వంటి పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ తొలిసారి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

    నిజానికి బాలీవుడ్ లో ఉన్నంత క్రేజ్ టాలీవుడ్ లో అంతగా ఉండదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ మారడంతో.. బాలీవుడ్ హీరోయిన్స్ బాగా ఆసక్తి చూపుతున్నారు. పారితోషికం విషయంలో కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కు టాలీవుడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అక్కడున్న ఫెసిలిటీస్ టాలీవుడ్ లో తక్కువగా ఉంటాయి కానీ బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తెలుగు సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు.

    ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ లో సోనాక్షి సిన్హా, బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా కు కత్రినా కైఫ్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు దీపికాపదుకొనె, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్, హరిహర వీరమల్లు సినిమాల్లో జాక్వెలైన్, మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో అనన్య పాండే ఇలా ఎంతో మంది హీరోయిన్స్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నారు.
    Published by:Navya Reddy
    First published: