Rebel Star Prabhas - Kareena Kapoor: యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ప్రభాస్ సెట్ లో ఉన్న వారందరికీ భోజనాలు పెట్టడం గురించి మనం వింటూనే ఉన్నాం. ఇలా ప్రతి సినిమా సెట్ లో ఉన్న వారందరికీ ప్రభాస్ అప్పుడప్పుడు భోజనాలు పెట్టిస్తుంటారు. ఈక్రమంలోనే ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రభాస్ కి పోటీగా రావణాసురుని పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా బిర్యాని పంపించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సైఫ్ భార్య కరీనాకపూర్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఆదివారం ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కరీనా కపూర్ స్పందిస్తూ.. బాహుబలి బిర్యానీ పంపించాడంటే కచ్చితంగా బాగుంటుంది థాంక్యూ ప్రభాస్ ఇలాంటి అద్భుతమైన ఫుడ్ పంపించినందుకు అని కామెంట్ రాసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్ లవర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కరీనా కపూర్ కరిష్మా కపూర్, తన స్నేహితులతో కలిసి ఫుడ్ తింటున్న టువంటి ఫోటోలు వీడియోలు ఇదివరకు అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పంపించిన బిర్యానీని చూడగానే ఆకలి వేయడంతో లొట్టలేస్తూ తిన్నానని ఈ సందర్భంగా కరీనా కపూర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
ఇక సినిమాల విషయాని కొస్తే సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ తో తలపడనుండగా.. కరీనా కపూర్ అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి కరీనా కపూర్ ప్రభాస్ పంపిన బిర్యాని గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఎంతోమంది ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bahubali, Bollywood, Instagram, Kareena Kapoor, Prabhas, Social Media