‘కెవ్.. కేక’ అంటూ టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ లో ఆడిపాడిన మలైకా అరోరా గుర్తుంది కదా..! వయసు మీద పడుతున్న తన అందచందాలతో.. నాట్యంతో ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ అందులో అప్ లోడ్ చేస్తుంటుంది. నిత్యం ఫిట్ గా కనపించే మలైకాకు.. రోజూ జిమ్ కు వెళ్లడం హాబీ. అయితే తాజాగా ఈ భామ.. జిమ్ లో ఒక వ్యక్తిని డంబెల్స్ తో కొట్టడానికి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
బాలీవుడ్ బింగీ ప్రొఫైల్ షేర్ చేసిన ఈ వీడియో లో మలైకా అరోరా జిమ్ లో సీరియస్ గా కసరత్తులు చేస్తుండగా.. ఎవరో వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమె సమాధానమిచ్చినప్పటికీ అవతలి వ్యక్తి ఏదో కామెంట్ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మలైకా.. ఆ వ్యక్తిపై డంబెల్ విసరబోయింది. ఇది చూసిన అవతలి వ్యక్తి.. ‘అమ్మబాబోయ్..’అనుకుంటూ అక్కిడి నుంచి పరుగు లంకించాడు. అయితే మలైకా కొడుతున్న వ్యక్తి ఎవరో మాత్రం తెలియరాలేదు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగానే నెటిజన్లకు ఈ వీడియో బాగా నచ్చింది. దీంతో కొద్దిసమయంలోనే ఆ వీడియోకు వేలాది లైకులు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు.. క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా.. యువ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిరువురు కలిసి పలు ఫోటో షూట్ లు కూడా చేశారు. ఇటీవలే ఈ జంటకు కరోనా కూడా సోకింది. ముందు అర్జున్ కపూర్ కరోనా బారిన పడగా.. తర్వాత మలైకా కు కరోనా సోకింది. దీనినుంచి వారిరువురూ త్వరగానే కోలుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Kapoor, Bollywood heroine, Bollywood news, Instagram, Malaika Arora, Social Media