Kriti Sanon: కొత్త కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kriti Sanon

Kriti Sanon: ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఏదైనా విలువైన కొత్త వస్తువులు కొన్న, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన.. వాటిని వెంటనే అభిమానులకు చూపించాలని ఆత్రుత పడుతుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తమకు సంబంధించిన విలువైన వాటిని పంచుకోగా.. ఇప్పటివరకు చాలా మంది సెలబ్రేటీలు తమ కార్ల ఫోటోలను బాగా పంచుకున్నారు.

  • Share this:
    Kriti Sanon: ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఏదైనా విలువైన కొత్త వస్తువులు కొన్న, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన.. వాటిని వెంటనే అభిమానులకు చూపించాలని ఆత్రుత పడుతుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తమకు సంబంధించిన విలువైన వాటిని పంచుకోగా.. ఇప్పటివరకు చాలా మంది సెలబ్రేటీలు తమ కార్ల ఫోటోలను బాగా పంచుకున్నారు. లగ్జరీ కార్లను ఎక్కువగా ఇష్టపడే నటులు వెంటనే వాటిని కొనేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ హీరోయిన్ కూడా కొత్త కారు కొని తన అభిమానులతో పంచుకుంది.

    ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు కృతి సనన్. బాలీవుడ్ కు చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో పరిచయం అయింది. కానీ ఈ సినిమాలో అంత సక్సెస్ అందుకోకపోగా.. మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

    ఇది కూడా చూడండి:ప్రభాస్ బ్యూటీకి పెళ్లి కళ వచ్చేసిందే..! పెళ్లి కూతురి గెటప్ లో కృతి సనన్ అందాలు అదుర్స్..

    ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం తనకంటూ కాస్త సమయాన్ని గడుపుతుంది. తనకు సంబంధించిన ప్రాజెక్టు విషయాలను, ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెంచుకుంది. ఇలా ఉంటే తాజాగా తనకు తానే ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చుకుంది. మెర్సిడెస్- మేబాచ్ జీ ఎల్ ఎస్ 600 కారును కొనుగోలు చేయగా దాని ఖరీదు దాదాపు రూ. రెండు కోట్ల వరకు ఉంటుందని నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇది కూడా చూడండి :ప్రభాస్ ‘ఆదిపురుష్‌’తో పాటు మరో టాలీవుడ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కృతి సనన్.. ?

    ఇక దీంతో ఈ కారు ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక ఈ కారు ఫోటోని చూసిన నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు. ఈ కారు ఖరీదు చూసి మరీ షాక్ అవుతున్నారు. మొత్తానికి మంచి ఫామ్ లో ఉన్న ఈ బ్యూటీ తను సొంతంగా ఒక కారును కొనుక్కుంది. ఇక ప్రస్తుతం ఆది పురుష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. ఇటీవలే తను షూటింగ్ బిజీలో ఉన్న సమయంలో సీత గెటప్ లో ఉన్న ఫోటోలను పంచుకోగా ఆ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
    Published by:Navya Reddy
    First published: