Ntr - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో లేటెస్ట్ అప్ డేట్ ... హీరోయిన్ మారింది

Bollywood Heroine in Ntr and Trivikram Movie Latest Update

Ntr - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో తెలుసా...

  • Share this:
    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం) సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేయ‌గానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా ర‌కాల వార్త‌లు వినిపించాయి. పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న పేర్ల‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది.

    అయితే ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో హీరోయిన్ చేరింద‌ని టాక్‌. దాదాపు ఈమెనే తీసుకునే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. వివ‌రాల మేర‌కు బాలీవుడ్‌లో ల‌వ్‌యాత్రి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన వ‌రీన హుస్సేన్ ఎన్టీఆర్ 30లో న‌టించ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే లుక్ టెస్ట్స్‌, ఆడిష‌న్స్ పూర్త‌య్యాయ‌ని అంటున్నారు. ఎన్టీఆర్ 30 ప్రారంభం కాగానే... వివ‌రాలు ప్ర‌క‌టిత‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు.

    ntr, trivikram, ntr 30, ntr next movie, ntr 30 latest update, ntr and trivikram movie update, bollywood heroine in ntr 30, bollywood heroine in trivikram movie, love yatri heroine in ntr 30, bollywood heroine warina hussain, warina hussain entry into tollywood, tollywood, telugu movie news, త్రివిక్రమ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ 30,
    Bollywood Heroine in Ntr and Trivikram Movie Latest Update


    అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.
    Published by:Anil
    First published: