sonalప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రూలర్’. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన రెండో ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమా తర్వాత బాలయ్య.. బోయపాటి శ్రీను సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తుందనే వార్తలు కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతూనే ఉన్నాయి. తాజాగా సోనాక్షి సిన్హా .. బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో నటించే విషయమై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో తాను నటించబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. అంతేకాదు తాను చేయబోయే తర్వాతి సినిమాను త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తానంటూ ప్రకటించింది. గతంలో సోనాక్షి సిన్హా.. ప్రభాస్..సాహో సినిమాలో ఆఫర్ వచ్చిన తిరస్కరించింది. ప్రస్తుతం ఈ భామ.. సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘దబంగ్ 3’ ‘రూలర్’ రిలీజ్ రోజైన డిసెంబర్ 20న విడుదల కానుంది.
There are some reports of me being roped in a film helmed by Balakrishna and Boyapati Sreenu. I'd just like to clarify that this isn't true, and I'll be making an announcement of my next project very very soon!