హోమ్ /వార్తలు /సినిమా /

మరోసారి అమ్మమ్మ అయిన బాలీవుడ్ భామ రవీనా టాండన్..

మరోసారి అమ్మమ్మ అయిన బాలీవుడ్ భామ రవీనా టాండన్..

రవీనా టాండన్ (Twitter/Photo)

రవీనా టాండన్ (Twitter/Photo)

రవీనా టాండన్.. ఈ పేరు ఉంటే చాలు.. ఒక తరం ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. తూ ఛీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ ‘మొహ్రా’ సినిమాలో  ఆమె చేసిన నృత్యం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తాజాగా ఈ భామ మరోసారి అమ్మమ్మ అయింది.

రవీనా టాండన్.. ఈ పేరు ఉంటే చాలు.. ఒక తరం ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. తూ ఛీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ ‘మొహ్రా’ సినిమాలో  ఆమె చేసిన నృత్యం ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తెలుగులో ఈ భామ.. బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో స్వాతిలో ముత్యమంత పాటలో తన తడి అందాలతో ఇక్కడి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ‘ఆకాశవీధిలో’ తో పాటు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తమ్మెదా’లో మెరిసింది. తాజాగా ఈ భామ మరోసారి అమ్మమ్మ అయింది.

నిన్నమొన్నటి వరకు వెండితెరపై తన తళుకులతో మెరుపులు మెరిపించిన ఈ భామ అపుడే అమ్మమ్మ అవడం ఏంటి అనుకుంటున్నారా ? ఏమి లేదు.. రవీనా టాండన్ ..హీరోయిన్‌గా ఉండగానే..పూజా మరియు ఛయ్యా అనే అమ్మాయిలను దత్తత తీసుకుంది. రవీనా టాండన్  యాక్సిడెంట్‌లో కన్నుమూసిన పూజా, ఛయ్యాల ఆలనా పాలనా చూడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వారిద్దరినీ చట్ట ప్రకారం దత్తత తీసుకుంది. అందులో ఛయ్యా అనే అమ్మాయి 2016లో పెళ్లి చేసింది. ఆమెకు ఇది వరకు బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆమెకు మరో బేబికి జన్మినిచ్చింది.ఈ విషయాన్ని  రవీనా టాండన్ తన సోషల్ మీడియలో అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఇక రవీనా టాండన్ 2004లో అనిల్ టాడానీ అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి రషా (2005) మరియు రణ్‌వీర్ (2008) అనే ఇద్దరు పిల్లలున్నారు.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Raveena Tandon

ఉత్తమ కథలు