Home /News /movies /

BOLLYWOOD HEROIN ISHA KOPPIKAR CONTROVERSY COMMENTS ON AJITH AND SUPER STAR RAJINIKANTH TA

నాగార్జున హీరోయిన్‌ పై మండిపడుతున్న అజిత్, రజినీకాంత్ ఫ్యాన్స్..

అజిత్ రజినీకాంత్

అజిత్ రజినీకాంత్

తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో పరిచయమైంది ఇషా కొప్పికర్. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన కలిసిరాలేదు. ఈ సందర్భంగా ఈ ఇషా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అజిత్, రజినీకాంత్ ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పించాయి.

ఇంకా చదవండి ...
    తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో పరిచయమైంది ఇషా కొప్పికర్. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన కలిసిరాలేదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ హిందీలో తెరకెక్కించిన ‘కంపెనీ’లో చేసిన ఖల్లాస్ పాటతో హోల్ ఇండియా పాపులర్ అయింది. ఆ తర్వాత తెలుగులో అపుడుపుడు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. రీసెంట్‌గా ఈ భామ తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన ‘కేశవ’లో ముఖ్యపాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్ దర్శకత్వంలో ఒక తమిళ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా ఈ ఇషా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అజిత్, రజినీకాంత్ ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పించాయి.

    ఈ సందర్భంగా ఈ ఇషా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అజిత్, రజినీకాంత్ ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పించాయి.
    ఇషా కొప్పికర్


    మీడియాతో తన అభిమాన నటుల గురించి చెప్పిన ఇషా తనకు అరవింద స్వామి అంటే చాలా ఇష్టమని, ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించానని చెప్పింది. మరోవైపు అజిత్ అంటే కూడా ఇష్టమని..ఐతే ఇపుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడో లేదో అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై అజిత్ ఫ్యాన్స్ ఇషా కొప్పికర్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ నటుడి పట్ల అభిమానం ఉన్నపుడు..ఆయన సినిమాలు చేస్తున్నారో లేదో ఏ స్థాయిలో ఉన్నారో తెలియదా ? అని మండిపడుతున్నారు.

    మరోవైపు తమిళనటుడు శివ కార్తికేయన్‌ను చూస్తుంటే రజినీకాంత్‌ను యంగ్‌గా ఉన్న రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పడం రజినీకాంత్ అభిమానులు కోపం తెప్పించింది. సూపర్ స్టార్‌తో ఒక యంగ్ హీరోను పోల్చుతావా ? అంటూ రజినీకాంత్ ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు.
    First published:

    Tags: Ajith, Isha koppikar, Kollywood, Nagarjuna, Rajinikanth, Tamil Cinema

    తదుపరి వార్తలు