బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో హీరోయిన్ ఆలియా భట్ బ్రేకప్ చెప్పేసినట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ కత్రినా, దీపికా వంటి వాళ్లతో బ్రేకప్ తర్వాత గత కొన్ని రోజులుగా ఆలియాతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరు కలిసి ఇపుడు ‘బ్రహ్మాస్త్ర’ అనే సోషియో ఫాంటసీ సినిమాలో మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ గ్యాప్‌లో ఈ ప్రేమ జంట రెస్టారెంట్లకు, పార్టీలకు కలిసే వెళుతున్నారు. దీని గురించి మీడియా అడిగితే...సినిమా చేస్తున్నాం కాబట్టి కలిసి వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు కూడా. ఆ తర్వాత ఆలియా తండ్రి మహేష్ భట్ మాత్రం తన కూతురు రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు.తాజాగా కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కాన్సిల్ కావడంతో అందరు హీరో, హీరోయిన్లు ఇంట్లోనే కాలక్షేఫం చేస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే మార్చి 15న ఆలియా బర్త్ డే ఉంది. ఇక ఆలియా తనపుట్టినరోజును ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది.
ఐతే.. ఆలియా పోస్ట్ చేసిన ఫోటోల్లో రణ్‌బీర్ కపూర్ లేకపోవడంతో వీరిద్దరు కొంపదీసి బ్రేకప్ చెప్పేసుకున్నారా అంటూ కొంత నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా చెవులు కొరుక్కున్నారు. తాజాగా ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫోటోను రణ్‌బీర్ కపూర్ తీసాడని చెప్పుకొచ్చింది. దీంతో రణ్‌బీర్‌తో బ్రేేకప్ చెప్పారంటూ వస్తోన్న వార్తలపై ఆలియా చాలా మృదువుగా సమాధానం ఇచ్చిందంటూ పులువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆలియాను తెలివిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆలియా భట్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్లో నటిస్తోంది. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఆలియా మాత్రం ఆర్ఆర్ఆర్ పై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Bollywood, Jr ntr, Ram Charan, Ranbir Kapoor, RRR, SS Rajamouli, Tollywood