హోమ్ /వార్తలు /సినిమా /

shah Rukh khan: ఆ మెగా హీరో తీసుకెళ్తే పఠాన్ మూవీ రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాలకు వస్తానన్న షారూక్‌

shah Rukh khan: ఆ మెగా హీరో తీసుకెళ్తే పఠాన్ మూవీ రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాలకు వస్తానన్న షారూక్‌

Shahrukh Khan(Photo:Twitter)

Shahrukh Khan(Photo:Twitter)

shah Rukh khan: బాలీవుడ్ హీరో షారూక్. సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్‌ వైరల్ అవుతోంది. పఠాన్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ అభిమాని సినిమా రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ఏదైనా థియేటర్‌కు వస్తారా అని అడిగితే షారూక్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ పేరు ప్రస్తావించడంపై చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌ (Shah rukh khan)నటించిన యాక్షన్, థ్రిల్లర్ మూవీ పఠాన్ (Pathaan)మరో మూడ్రోజుల్లో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు హీరో షారూక్. సోషల్ మీడియా(Social media) వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ముంబై హీరో. అయితే అభిమానుల్లో ఒకరు షారూఖ్‌ని మీరు పఠాన్ సినిమా రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ఏదైనా థియేటర్‌కు వస్తారా అని అడిగితే బాలీవుడ్ బాద్షా మెగాపవర్ స్టార్ రాంచరణ్ (Ramcharan)పేరు ప్రస్తావించారు. ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్‌(Bollywood)లో హాట్ టాపిక్‌గా మారింది.

Assam CM - Pathaan: ఇంతకీ షారుఖ్ ఖాన్ ఎవరు ? మీడియాను ప్రశ్నించిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ..

రాంచరణ్ తీసుకెళ్తే ఓకే..

నిన్నటి వరకు షారూక్ నటించిన పఠాన్ సినిమాలోని బే షరమ్ సాంగ్‌ గురించి మాట్లాడుకుంటే..ఇప్పుడు హీరో చేసిన ట్వీట్‌పై చర్చ జరుగుతోంది. అభిమాని అడిగిన ప్రశ్నకు షారూక్ ఖాన్ రాంచరణ్ తీసుకెళ్తే తప్పకుండా వస్తానంటూ ట్వీట్ చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతే కాదు మీరు నటించిన ఈ సినిమాపై ఎలాంటి స్పందన వస్తోందని అడిగిన ప్రశ్నకు బాగుంది..మా కష్టాన్ని అందరూ మెచ్చుకుంటున్నారంటూ బదులిచ్చాడు బాలీవుడ్ బాద్షా.

అడ్వాన్స్ బిజినెస్‌ అదుర్స్..

జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతున్న పఠాన్ సినిమాలో దీపికాపడుకొనె హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరు చేసిన రొమాంటిక్ సాంగ్ బే షరమ్‌పైనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఐదేళ్ల గ్యాప్ తర్వాత షారూక్‌ఖాన్ నటింటిన సినిమా పఠాన్ కావడంతో ఓపెనింగ్ బిజినెస్‌ సూపర్‌గా ఉంది.

Sreeleela: పట్టుచీర ..తలలో మల్లెపూలతో మతిపోగొడుతున్న శ్రీలీల.. నెటిజన్లు ఎవరితో పోల్చుతున్నారో తెలుసా..?

షారూక్‌ చెర్రి కలిసి నటించే ఛాన్సుందా..?

అడ్వాన్స్‌ బుకింగ్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది పఠాన్. గతేడాది రిలీజైన బ్రహ్మస్త్ర రికార్డులను అధిగమిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే షారూక్‌ఖాన్ పఠాన్ రిలీజ్‌ సందర్భంగా రాంచరణ్ పేరు ప్రస్తావించడం కొత్తేమి కాదు. రీసెంట్‌గా ట్రిపులార్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే నాకు దాన్ని ముట్టుకోవాలని అంటూ రాంచరణ్‌ని కోరడం జరిగింది. ఈపరిణామాలు చూస్తుంటే షారూక్‌ ఖాన్ , రాంచరణ్ కలిసి ఏదైనా మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారా అనే టాక్ కూడా ఇండస్ట్రీలో మొదలైంది. రీసెంట్‌గా చిరంజీవి లీడ్ రోల్ పోషించిన గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసినట్లుగా..బ్రహ్మస్త్రలో నాగార్జున చేస్తున్నట్లుగా ..ఫ్యూచర్‌లో షారూక్‌ ఖాన్ మూవీలో రాంచరణ్ కనిపిస్తాడా ఏంటనే చర్చ జరుగుతోంది.

First published:

Tags: Bollywood actor, Shah Rukh Khan

ఉత్తమ కథలు