Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కు ముంబై (Mumbai) ఇంట్లో బాంబ్ పెట్టినట్టు ఓ ఆగంతకుడు ఫోన్ చేయడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు.. షారుఖ్ ఇంటికి ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీసి ఆగంతకుడిని అరెస్ట్ చేశారు. ఇది ఫేక్ కాల్ అని తేలడంతో షారుఖ్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. షారుఖ్ ఖాన్ .. ఇల్లు మన్నత్‌కు ఆగంతుడు బాంబ్ పెట్టినట్టు చేసిన ఫేక్ కాల్ పై పోలీసులు ఆగంతుకున్ని విచారిస్తున్నారు. ఇతను కావాలనే చేసారా లేదా ఇంకేదైనా ఉద్దేశ్యంతో ఈ పని చేసారనే విషయమై లోతుగా ఆరా తీస్తున్నారు. షారుఖ్ ఖాన్ విషయానికొస్తే..
కింగ్ ఖాన్ విషయానికొస్తే.. ఒకప్పుడు తన పేరుతో బాలీవుడ్ బాక్సాఫీస్‌లను షేక్ చేసిన ఈయన..ఇపుడు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. దాదాపు ఏడేళ్ల క్రితం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అప్పట్లోనే రూ.400 కోట్లను వసూలు చేసి బాలీవుడ్‌లో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు.
Unstoppable with NBK : సమరసింహా రెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి.. బాలయ్య షోలో లైగర్ టీమ్ సందడి..
కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయడానికి కూడా ఇబ్బంది పడే స్థాయికి వచ్చేసాయి. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక చివరగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ కూడా కింగ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సినిమా ఫలితం తర్వాత షారుఖ్ ..తాను యాక్ట్ చేయబోయే సినిమాల విషయంలో పునరాలోచనలో పడ్డాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్. .సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్‌గా యాక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
షారుఖ్ ఖాన్.. తమిళ అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చే'స్తున్నారు. రీసెంట్‌గా ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ నటించిన ‘లయన్’ టైటిల్‌ను ఫిక్స్ చేసారట. ఈ చిత్రంతో నయనతార లేదా సమంత కథానాయికగా నటించే అవకాశం ఉంది. మరో హీరోయిన్‌గా ప్రియమణి దాదాపు ఖరారైంది. రీసెంట్‌గా షారుఖ్ ఖాన్..పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్.. ముంబై నార్కొటిక్స్ వాళ్లకు ఓ ఓడలో రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్ వాడుతూ పట్టుబడటం పెద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు ఆర్యన్ ఖాన్‌కు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.