KGF 2 అథిరా పాత్రలో నటించబోయే బాలీవుడ్ నటుడు ఇతడే..

కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. అంతేకాదు కన్నడ సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. తాజాగా ఈ సినిమాలో అథిరా పాత్రలో నటించబోయే నటుడిని ఈ నెల 29న అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.


Updated: July 26, 2019, 8:06 PM IST
KGF 2 అథిరా పాత్రలో నటించబోయే బాలీవుడ్ నటుడు ఇతడే..
‘కేజీఎఫ్’చాఫ్టర్
  • Share this:
కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది. అంతేకాదు కన్నడ సినిమా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాను 70,80ల్లో కర్ణాటకలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇకKGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు తీసుకున్నారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించారు. కానీ ఆ క్యారెక్టర్ చేసింది ఎవరో రివీల్ చేయలేదు. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్‌తో అథీరా పాత్రను వేయించినట్టు సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నారు. ఆ రోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడం విశేషం. ఇక  KGF ఛాప్టర్ 2లో సంజయ్ దత్ నటిస్తున్నాడా లేదా తెలియాలంటే ఈ నెల 29 ఉదయం 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.



First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...