బాలీవుడ్ ఖల్ నాయక్.. సంజయ్ దత్.. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో భాద పడతున్న సంగతి తెలిసిందే కదా. ఆగష్టు 8న శ్వాస సంబంధిత సమస్యతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బ్రీతింగ్ ప్రాబ్లెమ్‌తో సంజూ బాబా ఆస్పత్రిలో చేరడంతో ముందుగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు నెగిటివ్ వచ్చింది. తీరా మున్నాభాయ్‌కి ఊపిరితిత్తుల కాన్సర్ అంటూ డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఇపుడది మూడో స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం మున్నాభాయ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రికి చికిత్స రోజు వెళ్లి చెకప్ చేయించుకుంటున్నారు.
ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమైన సంజయ్ దత్.. తన ఆరోగ్య విషయమై దృష్టి కేంద్రీకరించారు. ఒకవైపు క్యాన్సర్‌తో పోరాడుతున్న సంజయ్ దత్.. శనివారం తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గణేష పూజ నిర్వహించారు. ప్రతి యేడాదిలాగే ఈ సారి గణేష్ చతుర్ధిని ఘనంగా చేసుకోలేకపోయినా.. గణపతి బప్పాపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. వచ్చే యేడాది పూర్తి ఆరోగ్యం, ఆనందాలతో ఈ పండగ చేసుకుంటాననే విశ్వాసం తనకు ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్లో గణేష్ చవితి పూజకు సంబంధించిన ఫోటోను షేర్ చేసారు. మొత్తంగా ఒంట్లో కాన్సర్ వ్యాధి ఉన్న అది ఎక్కడా కనిపించకుండా సంజయ్ దత్.. ఇంట్లో వినాయక పూజలో పాల్గొనడం చూసి అభిమానులు ఆయన త్వరగా క్యాన్సర్ నుంచి కోలుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.