బాలీవుడ్లో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత నెపోటిజమ్ గురించి ఒక్కసారిగా చర్చ మొదలైంది. దానికి ముందు నుంచి కూడా చాలా సార్లు ఈ టాపిక్ వచ్చినా కూడా సుశాంత్ లాంటి స్టార్ హీరో అలా చనిపోయే సరికి ఎవరూ తట్టుకోలేకపోయారు. అంత ఫ్యూచర్ ఉన్న హీరో ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నాడంటే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో అప్పట్నుంచి నెపోటిజమ్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. స్టార్ కిడ్స్ను అస్సలు ఎంకరేజ్ చేయొద్దంటూ సుశాంత్ అభిమానులతో పాటు.. నెటిజన్లు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే కొన్ని సినిమాలు ఓటిటిలో విడుదలైతే కనీసం పట్టించుకన్న పాపాన పోలేదు ఆడియన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నెపోటిజమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ 14లో ఈ నెపోటిజమ్ టాపిక్ వచ్చింది. ఈ రియాలిటీ షోలో కేవలం బంధుప్రీతిని సాకుగా చూపించి ఓ కంటెస్టెంట్ మరొకర్ని నామినేట్ చేసాడు. దాంతో సల్మాన్ ఖాన్ చాలా సీరియస్ అయ్యాడు.

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ (salman khan bigg boss)
బిగ్‌బాస్ 14 గత వారం నామినేషన్ టాస్క్‌లో భాగంగా రాహుల్ వైద్య.. జాన్ కుమార్ సనుని నామినేట్ చేశాడు. బంధుప్రీతి అంటే తనకు అసహ్యమని.. అందుకే జాన్ని నామినేట్ చేశానని తెలిపాడు. అంతేకాకుండా కేవలం తండ్రి కారణంగానే జాన్‌కు గుర్తింపు వచ్చిందని.. నిజానికి అతడికి అంత పాపులారిటీ లేదని చెప్పాడు రాహుల్. సింగర్ కుమార్ సను కొడుకు కావడం వల్లే రియాలిటీ షోలో ఉన్నాడని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పుడు విడుదలయ్యాయి. వీకెండ్ షోలో రాహుల్ వ్యాఖ్యలపై సల్మాన్ రియాక్షన్ మరో స్థాయిలో ఉంది. ‘ఒకవేళ నా తండ్రి నా కోసం ఏదైనా చేసినట్లయితే.. అది బంధుప్రీతి అవుతుందా’ అంటూ రాహుల్‌ని ప్రశ్నించాడు సల్మాన్ ఖాన్.
అంతేకాదు.. నామినేట్ అయిన జాన్‌ను కూడా నీ తండ్రి నీ పాటల కోసం ఎవరెవరి దగ్గర రిఫర్ చేసాడని అడిగాడు.. దానికి ఆయన ఒక్కసారి కూడా రిఫర్ చేయలేదని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత రాహుల్‌తో మాట్లాడుతూ నెపోటిజమ్ గురించి చెప్పడానికి ఇది అస్సలు వేదిక కాదు.. ఒకవేళ పిల్లల బాగు కోసం తండ్రులు చేసే మంచిని కూడా నెపోటిజమ్ అంటారా అంటూ సీరియస్‌గానే ప్రశ్నించాడు. గత ఎపిసోడ్లో రాహుల్ తన ప్రకటనపై విచారం వ్యక్తం చేశాడు.. అంతేకాదు నామినేట్ చేసిన జాన్‌కి క్షమాపణ కూడా చెప్పాడు. జాన్ తల్లిదండ్రులు విడిపోయారనే విషయం తనకు తెలియదని రాహుల్ స్పష్టం చేశాడు. ఏదేమైనా కూడా బిగ్ బాస్ హౌజ్‌లో నెపోటిజమ్ టాపిక్ రావడంతో మరోసారి అంతా హాట్ టాపిక్ అయిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:October 31, 2020, 15:38 IST