ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. అందులో బాలీవుడ్ హీరోలను పోలిన మనుషులు కూడా చాలానే ఉన్నారు. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్‌కు అయితే ఓ డూప్ ఉన్నాడు. ఒకవేళ రణ్‌బీర్ డేట్స్ కానీ దొరక్కపోతే అతన్ని పెట్టి తీసేయొచ్చు అనేంత అచ్చు గుద్దినట్లు ఉండే డూప్ జునైద్ షా. శ్రీనగర్‌లో ఉంటాడు ఈయన. చాలా సార్లు జూనియర్ రణ్‌బీర్ కపూర్ అంటూ హెడ్ లైన్స్‌లోకి కూడా వచ్చాడు ఈ కుర్రాడు. కానీ ఈయన మరణవార్త ఇప్పుడు హెడ్ లైన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
అయినా ఈ ఏడాది విషాదాలు బాలీవుడ్‌ను అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. తాజాగా మోడల్ జునైద్ షా కన్నుమూసాడు. చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు ఈయన. శ్రీనగర్‌లోని తన నివాసంలోనే ఈయన మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
OMG. My own son has a double!!! Promise cannot make out. A good double pic.twitter.com/iqF7uNyyIi
— Rishi Kapoor (@chintskap) April 16, 2015
జునైద్ షా మృతితో రణ్‌బీర్ కపూర్ అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. 2015లో ఈ కుర్రాడి గురించి తెలుసుకుని రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ కూడా ట్వీట్ చేసాడు. ఓ మై గాడ్ తన కొడుకుకు కూడా డూప్ ఉన్నాడు.. నమ్మలేకపోతున్నాను అంటూ అప్పట్లో రిషి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఇప్పుడు జునైద్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Ranbir Kapoor