ఎమ్జీఆర్,ఎన్టీఆర్ మధ్యలో రాజకీయ పార్టీ పెట్టిన హీరో ఎవరో తెలుసా..

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎమ్జీఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఒక నటుడు రాజకీయ పార్టీని స్థాపించాడు. అంతేకాదు దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 500 స్థానాలకు పైగా పోటీచేసారు. ఇంతకీ వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 13, 2019, 12:30 PM IST
ఎమ్జీఆర్,ఎన్టీఆర్ మధ్యలో రాజకీయ పార్టీ పెట్టిన హీరో ఎవరో తెలుసా..
NTR,MGR
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 13, 2019, 12:30 PM IST
మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. మన దగ్గరున్న చాలా మంది నటులు సినిమాల్లో నటిస్తూనే పాలిటిక్స్‌లో ఎంటరై ఒక వెలుగు వెలిగారు. భారత దేశంలో ఒక పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన సినిమా నటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ నటుడు ఎంజీఆర్ గురించే. 1972లో అప్పటి డీఎంకే పార్టీ ఛీఫ్ కరుణానిధితో విభేదించి AIADMK పార్టీని స్థాపించారు ఎంజీఆర్. ఆ తర్వాత 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత చనిపోయేంత వరకు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగానే కొనసాగారు.ఎంజీఆర్ తర్వాత రాజకీయ పార్టీని స్థాపించిన నటుల్లో బాలీవుడ్ స్టార్ దేవానంద్ ఒకరు. 1980లో ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ... 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది.

ఇందిరా గాంధీతో దేవానంద్ (ఫేస్‌బుక్ ఫోటో)


అంతకుముందు 1977లో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మాలనీ దేవానంద్‌ని కలిసి ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలకు వ్యతిరేకంగా జనతా పార్టీతో కలిసి పనిచేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన దేవానంద్..ఇందిరకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో స్వయంగా ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత జనతా పార్టీలో ఏర్పడిన లుకలుకల కారణంగా జనతా పార్టీ పూర్తి కాలం అధికారంలో కొనసాగలేకపోయింది. ఒక రకంగా జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయాల్లో ఒక విఫల ప్రయోగంగా నిలిచిపోయింది.

దేవానంద్ (ఫైల్ ఫోటో)





అయితే ఈ పరిణామాలేవీ దేవానంద్ రాజకీయ ఆసక్తిని తగ్గించలేకపోయాయి. దీనికితోడు అప్పటికే ఎంజీఆర్ పార్టీ పెట్టి తమిళనాడలో అధికారం చేపట్టడంతో... తాను కూడా అదే రకంగా రాజకీయాల్లో రాణించగలనని బలంగా నమ్మారు దేవానంద్. అందుకే 14 సెప్టంబర్ 1979లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా (NPI)ను స్థాపించారు. దేవానంద్ పార్టీకి నెహ్రూ సోదరి విజయలక్ష్మీ మద్దతు కూడా ప్రకటించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అప్పట్లో బాంబేలోని శివాజీ పార్క్‌లో దేవానంద్ చేసిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. దేవానంద్‌కు లభించిన ప్రజాదరణ చూసి ఇందిరా గాంధీ సైతం ఆయనతో కలిసి చేయాలనుకున్నారు. కానీ దేవానంద్ ఇందుకు అంగీకరించలేదు.


దేవానంద్ (ఫేస్‌బుక్ ఫోటో)
Loading...
1980 ఎన్నికల ముందు దేవానంద్ తన పార్టీ మేనిఫెస్టో అని ఎన్నో హామీలు ఇచ్చారు. అప్పట్లో చాలా మంది సినిమావాళ్లు సైతం దేవానంద్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం మరో విశేషం. ఎవరూ ఊహించని విధంగా ఆయన స్థాపించిన పార్టీ... దేశవ్యాప్తంగా 500పైగా స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దీంతో కలత చెందిన దేవానంద్ తన పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రకంగా దేశ రాజకీయాల్లో మెరుపులా వచ్చిన దేవానంద్ పార్టీ అంతే వేగంగా కనుమరుగైంది.తన సినీ ప్రస్థానం, రాజకీయాల్లో పాత్ర గురించిన వివరాలను తన ఆటో బయోగ్రఫీలో వివరించారు దేవానంద్. 2007లో దేవానంద్ 84వ బర్త్ డే రోజున ఆయన తన ఆటోబయోగ్రపీ పుస్తకాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ఆవిష్కరింపజేశారు.

మన్మోహన్, సోనియాలతో దేవానంద్



దేవానంద్ పార్టీ పెట్టిన రెండున్నరేళ్లకు తెలుగునాట మహానటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న పార్టీని స్థాపించిన ఎన్టీఆర్... పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ బలంగా లేకపోవడంతో తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు బ్రహ్మరథం పట్టి... టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు.


ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ (ఫేస్‌బుక్ ఫోటో)


ఆ తర్వాత వీరి స్పూర్తితో ఎంతో మంది నటులు సొంతంగా రాజకీయ పార్టీలను స్థాపించినా...ఎమ్జీఆర్, ఎన్టీఆర్ తరహాలో విజయాలు సాధించలేకపోయారు.ఈ రకంగా దేశరాజకీయల్లో దేవానంద్ పెట్టిన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అట్టర్ ఫ్లాపైతే...ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం సూపర్ హిట్‌గా నిలిచింది.
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...