ఆ ఆటో చుట్టూ మొక్కలే... అభినందిస్తూ అక్షయ్ కుమార్ ట్వీట్

షూటింగ్‌ వెళ్తుంటే తనకు ఈ మొక్కలతో నిండిపోయిన పచ్చగా ఆటో కనిపించిందని పేర్కొన్నారు అక్షయ్ కుమార్.

news18-telugu
Updated: September 18, 2019, 2:55 PM IST
ఆ ఆటో చుట్టూ మొక్కలే... అభినందిస్తూ అక్షయ్ కుమార్ ట్వీట్
ఆటోలో మొక్కలు
  • Share this:
స్వచ్ఛ భారత్,  గో గ్రీన్ అంటూ పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు పలువురిలో మంచి ఉత్తేజాన్ని నింపుతున్నాయి.  పర్యావరణం కోసం మొక్కలను పెంచాలన్న ఆలోచన చాలామందిలో పెరుగుతోంది. అందుకే రాష్ట్రాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే తాజాగా ఓ ఆటో డ్రైవర్... తన ఆటో మొత్తం గార్డెన్‌గా మార్చేశాడు. ఆటో ముందు.. పక్క భాగంలో మొక్కల్ని పెంచుతున్నాడు. తన ఆటోలో ప్రయాణించేవారికి ఓ పచ్చని తోటలో ప్రయాణించే అనుభూతిని కల్గిస్తున్నాడు. అంతేకాదు... తన ఆటోకు ఓ డస్ట్ బిన్ కూడా అమర్చాడు. ఆటోలో ప్రయాణించే వారు ఏదైనా చెత్తను రోడ్డుపై పడేయకుండా డస్ట్ బిన్ కూడా ఏర్పాటు చేశాడు.

అయితే ఈ అందమైన ఆటో రిక్షాకు సంబంధించిన విషయం ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. షూటింగ్‌ వెళ్తుంటే తనకు ఈ మొక్కలతో నిండిపోయిన పచ్చగా ఆటో కనిపించిందని. దాన్ని చూడగానే తన నీలికళ్లు కాస్త  పచ్చగా మారిపోయాయన్నారు. పచ్చదనం కోసం తనవంతుగా ఆటో డ్రైవర్ చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయమన్నారు అక్షయ్. అక్షయ్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు లైకులు కొడుతున్నారు. వెరీ నైస్ అంటూ... ఆటో డ్రైవర్‌ను అభినందిస్తున్నారు.First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు