Home /News /movies /

BOLLYWOOD HERO AKSHAY KUMAR INTERESTING COMMENTS ON FEMALE FAN SB

స్టార్ హీరో కోసం ఇంటి నుంచి పారిపోయిన మహిళ.. తల్లిదండ్రులతో మాట్లాడిన హీరో

బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్

బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్

తనను చూసేందుకు ఓ మహిళ ఇంటి నుంచి పారిపోయి వచ్చేసిందని తనకు తెలిసిందన్నారు. వెంటనే వారి తల్లిదండ్రుల్ని పిలిపించి మాట్లాడానని తెలిపారు.

     హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలకు అభిమానులు ఉండటం సర్వ సాధారణం. కొందరికి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. వారి అభిమాన నటుల కోసం ఏవేవో చేస్తుంటారు. కొందరికి గుళ్లు కడుతారు. మరికొందరి ఫోటోల్ని ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేస్తారు. కొందరు సెలబ్రిటీల పేరుతో అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో మాట్టాడుతూ.. తాను ఓ మహిళ అభిమాని విషయంలో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. ఆయన ఇంకెవరో కాదు..  బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) .


    ప్రస్తుతం అక్షయ్ ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’( Samarat Prithviraj ) సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. జూన్‌(June) 3న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి డాక్టర్‌ చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకుడు. ఈ సినిమా ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నాడు  అక్షయ్‌ కుమార్. ఈ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన ఆసక్తికర ఘటనలూ పంచుకుంటున్నారు. తన కోసం  ఒక మహిళా అభిమాని ఇంటి నుంచి పారిపోయి వచ్చిందని  తెలిపారు అక్షయ్‌.


    ఆయన మాట్లాడుతూ…'నన్ను చూడాలని ఒక మహిళా అభిమాని ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఈ విషయం నా దృష్టికి రాగానే వాళ్ల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాను. ఆ తర్వాత ఆమె క్షేమంగా ఇళ్లు చేరిందని తెలిసింది. అభిమానులను నేను చాలా గౌరవిస్తాను. అయితే మీకూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని, మాకంటే దానికే విలువ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటాను'అని చెప్పారు. అక్షయ్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


    అక్షయ్ కుమార్‌ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన నిర్మాత, మార్షల్ కళాకారుడు కూడా. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన అక్షయ్ దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు. రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందాడు. 1990లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించాడు అక్షయ్.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Akshay Kumar, Bollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు