రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్.. బీహార్ వరద బాధితులకు రూ.కోటి విరాళం..

బాలీవుడ్ స్టార్ కథానాయకుడు అక్షయ్ కుమార్..రియల్ లైఫ్‌లోనే కాదు. రీల్ లైఫ్‌లో నిజమైన హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా బిహార్ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి తన వంతు ఆర్ధిక సహాయం ప్రకటించాడు.

news18-telugu
Updated: October 29, 2019, 7:27 PM IST
రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్.. బీహార్ వరద బాధితులకు రూ.కోటి విరాళం..
అక్షయ్ కుమార్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ స్టార్ కథానాయకుడు అక్షయ్ కుమార్..రియల్ లైఫ్‌లోనే కాదు. రీల్ లైఫ్‌లో నిజమైన హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే పలు సామాజిక సమస్యలపై స్పందిస్తూ...దానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు.తాజాగా అక్షయ్ కుమార్.. బీహార్ వరద బాధితులకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వరదల వలన రోడ్డున పడ్డ 25 కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించునున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు చాత్ పూజ శుభ సందర్భంగా రూ.1 కోటి రూపాయల మొత్తాన్ని అందజేయనున్నట్టు సమాచారం. ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఏమి చేయలేని ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి సాధ్యమమైనంత సాయం చేసేందుకు అందరు ముందుకు రావాలని ఈ సందర్భంగా అక్కీ  పిలుపునిచ్చారు. తాజాగా అక్షయ్ కుమార్ తాజాగా ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రంతో ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది.

First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు