2019లో 750 కోట్లు వసూలు చేసిన స్టార్ హీరో..

ఒకే ఏడాది 750 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసి చూపించాడు. ఈయన హిట్ అయినా.. ఫట్ అయినా వరసగా సినిమాలు మాత్రం చేస్తుంటాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2020, 7:30 PM IST
2019లో 750 కోట్లు వసూలు చేసిన స్టార్ హీరో..
అక్షయ్ కుమార్ (Twitter/Photo)
  • Share this:
ఒకే ఏడాది 750 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసి చూపించాడు. ఈయన హిట్ అయినా.. ఫట్ అయినా వరసగా సినిమాలు మాత్రం చేస్తుంటాడు. అలాగే గతేడాది కూడా నాలుగు సినిమాలు చేసాడు ఈయన. వరసగా అన్ని విజయాలు సాధించాయి కూడా. బాక్సాఫీస్ దగ్గర అక్కీ భాయ్ హవా చూపించాయి ఈ చిత్రాలన్నీ. ముఖ్యంగా డబ్బుతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నాడు ఖిలాడీ. గత వారం విడుదలైన గుడ్ న్యూస్ కూడా సంచలన విజయం సాధించింది. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా 2019లో చరిత్ర సృష్టించాడు అక్షయ్‌ కుమార్. ఈయన తర్వాతే సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు కూడా ఉన్నారు.

Bollywood hero Akshay Kumar created history in 2019 with 750 crore collections pk ఒకే ఏడాది 750 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసి చూపించాడు. ఈయన హిట్ అయినా.. ఫట్ అయినా వరసగా సినిమాలు మాత్రం చేస్తుంటాడు. akshay kumar,akshay kumar movies,akshay kumar collections,akshay kumar good news movie,akshay kumar kesari movie,akshay kumar mission mangal movie,akshay kumar 750 crores,akshay kumar 2019,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్,అక్షయ్ కుమార్ 750 కోట్లు,హిందీ సినిమా
అక్షయ్ కుమార్


కేసరితో 2019 మొదలుపెట్టిన ఈయన.. మిషన్ మంగళ్.. హౌస్‌ఫుల్ 4.. గుడ్ న్యూస్ సినిమాలతో వరసగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాడు అక్షయ్. ఈ సినిమాలన్నీ కలిపి దాదాపు 750 కోట్లు వసూలు చేసాయి. 2020లోనూ ఈయన హవా కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా వరస సినిమాలతో దండయాత్ర చేస్తున్నాడు అక్షయ్ కుమార్. 2020లో కూడా నాలుగు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు ఖిలాడీ. కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్‌.. రోహిత్ శెట్టి సూర్వ వంశీ.. పృథ్వీరాజ్ చిత్రాలతో పాటు మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. మొత్తానికి అక్షయ్ దూకుడు చూస్తుంటే ఖాన్స్ త్రయానికి చుక్కలు కనిపిస్తున్నాయి.

First published: January 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు