బాలయ్యను గుడ్డిగా ఫాలో అవుతున్నఆ బాలీవుడ్ అగ్ర హీరో..

బాలకృష్ణ (Twitter/Photo)

నందమూరి నట సింహం బాలకృష్ణను ఆ బాలీవుడ్ అగ్ర హీరో ఫాలో అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  నందమూరి నట సింహం బాలకృష్ణను బాలీవుడ్ సీనియర్  అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్  ఫాలో అవుతున్నాడు. అజయ్ దేవ్‌గణ్ ఏంటి బాలయ్యను ఫాలో కావడం ఏమిటి అనుకుంటున్నారా ?  ఏమి లేదు.. బాలకృష్ణ తన వందో సినిమాను చారిత్రక కథా నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. మరోవైపు అదే బాటలో అజయ్ దేవ్‌గణ్.. తన వందో సినిమాను కూడా అదే రీతిలో చారిత్రక నేపథ్యమున్న ‘తానాజీ’ సినిమా చేస్తున్నాడు. మరాఠా సామ్రాజ్యధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్.. దగ్గర సుబేదార్‌గా పనిచేసి శివాజీ ఎన్నో విజయాల్లో కీలక భూమిక పోషించిన  తానాజీ‌గా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

  bollywood hero ajay devgn follows tollywood senior top hero nandamuri balakrishna here are the details,balakrishna,ajay devgn,ajay devgan,nandamuri balakrishna, balakrishna gautamiputra satakarni,Tanhaji,gautamiputra satakarni,ajay devgn tanhaji,balakrishna 100th film gautamiputra satakarni,ajay devgn 100th film tanhaji,balakrishna twitter,balakrishna facedbook,balakrishna instagram,ajay devgn instagram,ajay devgn facebook,ajay devgn twitter,bollywood,tollywood,hindi cinema,telugu cinema,బాలకృష్ణ,అజయ్ దేవ్‌గణ్,బాలకృష్ణ అజయ్ దేవ్‌గణ్,బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి,అజయ్ దేవ్‌గణ్ తానాజీ,బాలకృష్ణ 100వ సినిమా,అజయ్ దేవ్‌గణ్ 100వ సినిమా,తానాజీ మూవీ రివ్యూ
  బాలకృష్ణ,అజయ్ దేవ్‌గణ్ (File Photos)


  ఓం రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను అజయ్ దేవ్‌గణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య కాజోల్ చాలా కాలం తర్వాత అతని సరసన యాక్ట్ చేస్తోంది. మరి బాలయ్యలాగే ..అజయ్ దేవ్‌గణ్ తన వందో సినిమాతో హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: