news18-telugu
Updated: April 7, 2019, 3:26 PM IST
ఆమీర్ ఖాన్,చిరంజీవి
రీసెంట్గా చిరంజీవి..సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ టూర్లోె చిరంజీవితో పాటు ఆమె శ్రీమతి సురేఖ కూడా వెళ్లారు. అక్కడ షూటింగ్ ముగించుకొని తిరిగి భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా జపాన్లోని క్యోటో ఎయిర్ పోర్ట్లో చిరంజీవికి ఆమీర్ ఖాన్ దంపతులు ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్..చిరుతో కలిసి ఒక ఫోటోను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నా ఫేవరేట్ నటుల్లో ఒకరైన చిరంజీవిని క్యోటో ఎయిర్పోర్ట్లో కలిసాను. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ ‘సైరా నరిసింహారెడ్డి’ సినిమా గురించి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిరంజీవిగారిని అడిగి తెలుసుకున్నానన్నారు. మీరు మాకు ఎపుడు స్పూర్తి అంటూ చిరు గొప్పదనాన్ని ఆమీర్ ఖాన్ కొనియాడారు.

జపాన్లో సైరా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వస్తున్న చిరంజీవి దంపతులను బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అమీర్ ఖాన్ దంపతులు టోక్యో ఎయిర్పోర్ట్లో కలిశారు.
‘సైరా’ నరసింహారెడ్డి విషయానికొస్తే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,సుదీప్,తమన్నా, విజయ్ సేతుపతి,జగపతిబాబులు ముఖ్యపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 7, 2019, 3:26 PM IST