BOLLYWOOD HERO A MAN HAS REGISTERED A CASE AGAINST HERO VICKY KAUSHAL FOR USING HIS BIKE NUMBER EVK
Bollywood: ఆ బైక్ నంబర్ ప్లేట్ నాదే.. బాలీవుడ్ హీరోపై పోలీసులకు ఫిర్యాదు!
కత్రినా కైఫ్ - విక్కి కౌషల్ (ఫైల్)
Bollywood Hero | ఇటీవలే ఇంటివాడైన బాలీవుడ్ నటుడు విక్కికౌషల్‌పై కేసు నమోదైంది. తాజాగా ఇండోర్‌కు చెందిన జైసింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విక్కికౌషల్ తాజాగా సారా ఆలీఖాన్‌తో కలిసి సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తాజాగా ఓ సన్నివేశం చిత్రీకరించారు. ఇప్పుడు ఈ చిత్రీకరణలో వాడిన బైక్ వివాదాస్పదం అయ్యింది.
ఇటీవలే ఇంటివాడైన బాలీవుడ్ (Bollywood) నటుడు విక్కికౌషల్‌పై కేసు నమోదైంది. తాజాగా ఇండోర్‌కు చెందిన జైసింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విక్కికౌషల్ తాజాగా సారా ఆలీఖాన్‌తో కలిసి సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తాజాగా ఓ సన్నివేశం చిత్రీకరించారు. ఆ సినిమాలో హీరో వాడిన బైక్ నంబర్ తనదేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో చిత్ర బృందానికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ, అనుమతులు తీసుకోకుం డా ఒక ద్వి చక్రవాహన నం బర్ వేరొకరు వాడటం చట్ట వ్య తిరేకం అని అతను పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు.
దీనిపై పోలీసులను వివరణ అడగ్గా.. జైసింగ్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని తెలిపారు. అతని ఫిర్యాదు నిజంగా ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు. చిత్రబృందం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు.
ఇండోర్‌లో షూటింగ్.. విక్కి కౌషల్ (Vicky Kushal) , సారా ఆలీఖాన్‌తో కలిసి ఓ విభిన్న ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్రీకరణకు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే జైసిం గ్ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు షూట్
నుంచి చిన్న బ్రేక్ తీసుకొని ఇటీవల విక్కీ ముంబయికి వచ్చారు. కత్రినాతో వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి ఇండోర్‌లో సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు.
కత్రినాతో గ్రాండ్‌గా వివాహం విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ (Katrina Kaif and Vicky Kaushal)ల వివాహ వేడుకల గ్రాండ్‌గా జరిగాయి. ఈ జంట పెళ్లి ఇప్పటికే బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ (Bollywood) లో విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ (Katrina Kaif) వివాహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వివాహం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 9 న వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరూ రాజస్థాన్‌లోని అన్యదేశ కోటలో వివాహాన్ని ప్లాన్ చేసుకున్నారు.
అధికారిక ధ్రువీకరణ, చిత్రాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. విక్కీ కౌషల్, కత్రినా ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి పని చేయలేదు. ఇంతకీ ఈ జంట ఎలా కలిశారు? అని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్య పోతున్నారు. అయితే కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ (Coffee With Karan)లో ప్రారంభమైందని చాలా మంది విశ్వసిస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.