BOLLYWOOD FAMOUS CHOREOGRAPHER SAROJ KHAN DEFENDS CASTING COUCH AND FIRE ON SRI REDDY TA
అప్పట్లో శ్రీ రెడ్డిపై మండిపడ్డ సరోజ్ ఖాన్.. కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించిన కొరియోగ్రాఫర్..
సరోజ్ ఖాన్, శ్రీరెడ్డి (File/Photo)
బాలీవుడ్ చిత్ర సీమలో ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లతో స్టెప్పులు వేయించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో (71) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించడంతో పాటు శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడింది.
బాలీవుడ్ చిత్ర సీమలో ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లతో స్టెప్పులు వేయించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో (71) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. బాలీవుడ్లో సరోజ్ ఖాన్‌ను అందరు మాస్టర్జీ అని సంభోదిస్తారు. 71 ఏళ్ల సరోజ్‌ఖాన్ శ్వాసకోస సమస్యలతో జూన్ 20వతేదీన బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. సరోజ్ ఖాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా 2 వేలకు పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ఈమె మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఈమె అప్పట్లో ..శ్రీరెడ్డి కౌస్టింగ్ కౌచ్ ఇష్యూపై సరోజ్ ఖాన్ మండిపడటం అప్పట్లో పెద్ద సంచనలమే క్రియేట్ చేసింది.
సరోజ్ ఖాన్, శ్రీరెడ్డి (File/Photo)
ఈ సందర్భంగా అప్పట్లో సరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. అసలు ఒక అమ్మాయికి ఏం కావాలన్నది ఆమె తెలియాలంది. ఆడవాళ్లను మగాళ్లు ఎవరు బలవంతం చేయలేరు. ఆమెలో టాలెంట్ ఉంటే తనను తాను అమ్ముడు పోవాలనుకోదు. సినీ పరిశ్రమ నాతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించిన తండ్రి లాంటిది. ఈ ఇండస్ట్రీలో పై ఆరోపణలు చేయడం తగదన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీ పుట్టిక నుంచే ఉందంటూ పెద్ద బాంబే పేల్చింది.అంతేకాదు సరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రతి రంగంలో ఎవరైనా ఆడామె కనపడితే చాలు.. ఎవరో ఒకడు తాకాలని చూస్తాడు. ఇలాంటి పనులు సినీ రంగంలోనే కాదు. ప్రభుత్వ అధికారులతో పాటు అన్ని రంగాల వాళ్లు కూడా చేస్తుంటారు. కానీ అందరు సినీ రంగంపైనే బురద జల్లుతూ ఉంటారని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించింది. చిత్ర పరిశ్రమ మనకు తిండి పెడుతుంటే కృతజ్ఞత లేకుండా ఆరోపణలు గుప్పించడంపై అప్పట్లో సరోజ్ ఖాన్.. శ్రీ రెడ్డి లాంటి వాళ్లపై మండిపడుతూ... కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించింది.
సరోజ్ ఖాన్, శ్రీరెడ్డి (File/Photo)
ఇది మీకు జీవనోపాధికి సూచించే మార్గం. దీన్ని అత్యాచారంగా ఎలా పరిగణిస్తారని నిలదీసింది. ఆ తర్వాత సరోజ్ ఖాన్.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కూడా చెప్పింది.సరోజ్ ఖాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా 2 వేలకు పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ సినిమాలో ‘డోలా రే డోలారే ’ పాటతో పాటు ‘తేజాబ్’ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ‘ఏక్ దో తీన్’ పాటలు ఆమెకు మంచి గుర్తింపును ఇచ్చాయి. షాహిద్ కపూర్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘యే ఇష్క్ హై’ పాట ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. మొత్తంగా ఆమెకు నృత్య దర్శకత్వంలో వచ్చిన మూడు చిత్రాలతో జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఈమె తెలుగులోచిరంజీవి హీరోగా ‘డాడీ’ సినిమాతో పాటు ‘చూడాలని వుంది’, ‘మృగరాజు’ సినిమాల్లో కొన్ని పాటలకు కొరియోగ్రఫీ అందించింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.