• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD DRUGS RACKET NCB SOURCES CLAIM THAT A FORMER MODEL ACTOR BEHIND THIS SCANDAL PK

Sushant Singh Rajput Death: బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో బిగ్ ఫిష్ ఎవరో చెప్పిన NCB..

Sushant Singh Rajput Death: బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో బిగ్ ఫిష్ ఎవరో చెప్పిన NCB..

బాలీవుడ్ డ్రగ్స్ కేసు (Bollywood Drugs case)

Bollywood Drugs Racket: ఎక్కడో మొదలై.. మరెక్కడో మలుపులు తిరుగుతుంది బాలీవుడ్ డ్రగ్స్ కేసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నుంచి ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ కేసు దగ్గర ఆగింది.

  • Share this:
ఎక్కడో మొదలై.. మరెక్కడో మలుపులు తిరుగుతుంది బాలీవుడ్ డ్రగ్స్ కేసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నుంచి ఎన్నో మలుపులు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ కేసు దగ్గర ఆగింది. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా మందికి నార్కోటిక్స్ అధికారులు సమన్లు జారీ చేసారు. వాళ్లు పిలిచి విచారిస్తున్నారు. రోజుకో సంచలన విషయం ఇందులో బయటికి వస్తుంది. ఎవర్ని విచారిస్తే ఎవరు బయటికి వస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. సుశాంత్ కేసు నుంచి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ కేసును కదిలించారు అధికారులు. అందులో సుశాంత్ డ్రగ్ అడిక్ట్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది రియా. తనకు రోజూ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండేదని.. దానికోసం తనతో పాటు తన సోదరుడిని కూడా వేధించేవాడని ఆరోపించింది రియా చక్రవర్తి.
బాలీవుడ్ డ్రగ్స్ కేసు (Bollywood Drugs case)
బాలీవుడ్ డ్రగ్స్ కేసు (Bollywood Drugs case)

ఈమె విచారణలో భాగంగానే సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, దీపిక పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా నార్కోటిక్స్ విచారణకు హాజరయ్యారు. దాంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. వీళ్ల అందానికి కారణం డ్రగ్స్ తీసుకోవడమా అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో కీలకం ఎవరు.. అసలు కారకుడు ఎవరు అనేది ఇప్పుడు ఎన్సీబీ అధికారులు బయట పెట్టేసారు. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసును ఓ మాజీ మోడల్ కమ్ నటుడు ఉన్నాడని NCB అధికారులు చెప్తున్నారు. ఈ డ్రగ్ రాకెట్ నడిపే మాస్టర్ మైండ్ కూడా అతడిదే అని CNN IBNకి నార్కోటిక్స్ అధికారుల నుంచి సమాచారం వచ్చింది.

ఆయన బాలీవుడ్‌లో చాలా పెద్ద మనిషి అని.. అందులోనూ మత్తు వ్యవహారం మొత్తం అతడి కనుసన్నల్లోనే జరుగుతుందని తెలుస్తుంది. అంతేకాదు బాలీవుడ్ టాప్ 3 యాక్టర్స్‌కు కూడా అధికారులు సమన్లు జారీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. వాళ్ల పేర్లు కూడా బయటికి రావడంతో మరో వారం రోజుల్లోనే వాళ్లను కూడా విచారణకు ఆదేశిస్తారని వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే బాలీవుడ్‌లో మరిన్ని సంచలన విషయాలు బయటికి రావడం ఖాయం. కరణ్ జోహార్ సహా మరో ఏడుగురు కీలక వ్యక్తుల పేర్లు కూడా ఎన్‌సిబి లిస్టులో ఉన్నాయి. ఆయన్ని కూడా త్వరలోనే విచారణకు పిలవనున్నారు. ఏదేమైనా కూడా సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. మరి ఎన్‌సిబి అధికారులు చెప్తున్న ఓ బిగ్ ఫిష్ ఎవరనేది త్వరలోనే తేలనుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు