Aryan Khan Drugs Case: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు..

ఆర్యన్ ఖాన్ (Aryan Khan)

Aryan Khan Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు (Aryan Khan Drugs Case) బెయిల్ మంజూరు చేసింది ముంబై హై కోర్టు. ఇప్పటికే మూడు సార్లు బెయిల్‌ నిరాకరించడంతో నాలుగో సారి ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.

  • Share this:
వచ్చేసింది.. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చేసింది. ఇప్పటికే మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో నాలుగోసారి ఏమవుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా కనిపించింది. అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది ముంబై హై కోర్టు. ఇప్పటికే మూడు సార్లు బెయిల్‌ నిరాకరించడంతో నాలుగో సారి ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఊపిరి తీసుకుంది. కొడుకు లేకపోతే పండగలు కూడా చేసుకోను.. ఏదైనా ఆర్యన్ వచ్చిన తర్వాతే అంటూ ఇఫ్పటికే గౌరీ ఖాన్ కూడా చెప్పింది. ఆమె కోరికకు తగ్గట్లుగానే ఆర్యన్ ఖాన్ ఇప్పుడు విడుదలవుతున్నాడు. బెయిల్‌పై బయటికి వస్తున్నాడు. రెండు రోజుల విచారణ అనంతరం ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది కోర్టు. ఆయనతో పాటు మరో ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేసింది హై కోర్టు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. అక్టోబర్ 27న మొదలైన విచారణ 28 నాటికి వాయిదా పడింది. మళ్లీ హియరింగ్‌కు వచ్చిన తర్వాత ఆర్యన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు బెయిల్ కోసం విన్నవించారు. అక్టోబర్ 27న ఆర్యన్ తరుఫు న్యాయవాదుల వాదన విన్న న్యాయస్థానం.. అక్టోబర్ 28న ఎన్సీబీ తరఫు లాయర్ వాదనలు విన్నది. ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టులో.. NDPS ప్రత్యేక కోర్టులో బెయిల్ నిరాకరించారు. దాంతో ఈ సారి హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. వాళ్ళ ఆశలు వమ్ము కాలేదు. నాలుగో ప్రయత్నంలో బెయిల్ వచ్చింది.

Ram Charan car driver salary: రామ్ చరణ్ తన డ్రైవర్‌‌కు అంత జీతం ఇస్తున్నాడా.. సాఫ్ట్‌వేర్ జాబ్ రేంజ్ అది..!


Samantha - Naga Chaitanya: పాత జ్ఞాపకాలు వద్దు.. నాగ చైతన్యకు మరో షాక్ ఇచ్చిన సమంత..


హై కోర్టులో ఆర్యన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఆర్యన్ సెలబ్రిటీ కావడం వల్లే ఈ కేసు ఇంత పెద్దగా అయిందని.. నిజానికి అది చాలా చిన్న తప్పే అని.. కావాలనే అతడిని ఇరికించారని వాదించాడు. అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని చెప్పారు. అధికారులు బెయిల్‌ను అడ్డుకోవడానికి ఆధారాలుగా చూపిస్తున్న వాట్సాప్ ఛాటింగ్స్ ఆరు నెలల క్రితం నాటివంటూ చెప్పుకొచ్చాడు లాయర్. ఆర్యన్ దగ్గర, అతడి స్నేహితుడి వద్ద చాలా తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరకడం వలన బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరారు. వాదనలు, ప్రతివాదనలు విన్న తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై హై కోర్టు.
Published by:Praveen Kumar Vadla
First published: