Rakul Preet Singh: డగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్

Rakul Preet Singh: తన లాయర్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో మీడియా విచారణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు రకుల్ ప్రీత్ సింగ్. తనపై మీడియా కవరేజీ ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: September 17, 2020, 12:24 PM IST
Rakul Preet Singh: డగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
  • Share this:
బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన రియా చక్రవర్తి పలువురు బాలీవుడ్ నటీనటుల పేర్లు వెల్లడించినట్లు ఇటీవల ఎన్సీబీ అధికారికంగా ప్రకటించింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఉన్నాయని తెలిపింది. NCB డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ప్రకటన చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి కుప్పలు తెప్పలుగా వార్తలొచ్చాయి. వాటిని చూసి రకుల్ ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన లాయర్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో మీడియా విచారణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు రకుల్ ప్రీత్ సింగ్. తనపై మీడియా కవరేజీ ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మీడియా కథనాలు I & B మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని పేర్కొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం..కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖతో పాటు ప్రసార భారతికి, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌, ప్రెస్ కౌన్సిల్‌కు నోటీసులు పంపింది. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.


బాలీవుడ్ కేసులో సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌తో పాటు 25 పేర్లను రియా చక్రవర్తి వెల్లడించిందని మొదట ప్రచారం జరిగింది. ఐతే అలాంటిదేమీ లేదని.. అదంతా ఊహాగానాలేనని ఆ తర్వాత వార్తలు వచ్చాయి. దాంతో రకుల్‌కు చాలా మంది సెలబ్రిటీలు అండగా నిలిచారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా #NoRakul #NoSara అంటూ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌కు సారీ చెప్పారు. వీళ్లిద్దరికి సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా మద్దతు తెలిపింది. కానీ అంతలోనే ఎన్సీబీ అధికారిక ప్రకటన చేస్తూ.. సారా, రకుల్ పేర్లను రియా వెల్లడించిందని తెలపడంతో మళ్లీ దుమారం రేగుతోంది.

ఇక బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు శోవి‌క్‌కు కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని బైకుల్లో జైలో ఉన్నారు రియా చక్రవర్తి.

సుశాంత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఇందులో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో ఆ కోణాన్ని ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో లింకులను జోడిస్తూ వెళ్లిన ఎన్‌సీబీ మొదట డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కొంతమందిని విచారించి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రియాను కూడా అరెస్ట్ చేశారు. ఇక సుశాంత్ ఖాతాల్లోని డబ్బుల లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 17, 2020, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading