NCB Summons To Karan Johar | సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంతో పాటు డ్రగ్స్ వాడకం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లతో పాటు పలువురు సెలబ్రిటీలను NCB ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉంటే 2019 నాటికి కరోణ్ జోహర్ ఇచ్చిన పార్టీపై ఎన్సీబీ దృష్టి పెట్టింది. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణకు హాజరైన శ్రద్ధా కపూర్ చెప్పడంతో.. ఈ పార్టీలో ఎవరెవరూ పాల్గొన్నారనే దానిపై ఎన్సీబీ ఫోకస్ చేసింది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్‌కు సమన్లు జారీ చేసింది. గతేడాది కరణ్ జోహార్ ఇంట్లో ఇచ్చిన పార్టీకి సంబంధించిన వీడియో ఆధారంగా NCB సమన్లు జారీ చేసింది.
కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి సంబంధించి మహారాష్ట్రకు చెందిన మజిందర్ సింగ్‌తో పాటు సిర్సాకు చెందిన శిరోమణి అకాలీదళ్ నేత ఫిర్యాదుల మేరకు కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీ పై ఎన్సీబీ ఈ విచారణ చేపట్టింది. ఈ కేసులో భాగంగా కరణ్ జోహార్‌కు సమన్లు జారీ చేసింది. ఇక ఎన్సీబీ ఈ విచారణలో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో నిజంగా డ్రగ్స్ వాడారా లేదా అనే విషయమై ఆయన్ని విచారించనున్నారు. ఈ పార్టీలో దీపికా, అర్జున్ కపూర్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్సీబీ పలువురు బాలవుడ్ ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో కరణ్ జోహర్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ మాజీ ఉద్యోగి క్షిత్జీ ప్రసాద్‌ను ఎన్సీబీ ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.