news18-telugu
Updated: September 25, 2020, 9:03 AM IST
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో దీపికాతో పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్. రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా ఈ నెల 26వతేదీన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల దర్యాప్తునకు దీపికా హాజరు కానుంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి గురువారం రాత్రి గోవా నుంచి ముంబైకు వచ్చింది. సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల పాత్ర గురించి ఎన్సీబీ అధికారులు శుక్రవారం దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించనున్నారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ కూడా శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానుంది.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
ఇక ఈ డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం విచారించనున్నారు. అయితే రకుల్ మొదట తనకు ఎటువంటి సమన్లు అందలేదని పేర్కోంది. ఈ కేసుకు సంబందించి దీపికా పదుకోణే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటిసులు అందలేదని పేర్కోన్న రకుల్.. ఆ తర్వాత మాట మార్చి అందాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రకుల్ ఈరోజు ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకానుంది. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ డ్రగ్స్ కేసులో మరో 39 మంది పేర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ తాజా లిస్ట్‌లో ప్రముఖ నటుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Published by:
Suresh Rachamalla
First published:
September 25, 2020, 8:56 AM IST