Home /News /movies /

BOLLYWOOD DIRECTOR SON JUMPS TO DEATH DUE TO FATHER TOLD STOP TO DRINK TA

Director Son Sucide : ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ దర్శకుడు కుమారుడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రముఖ దర్శకుడు కుమారుడు ఆత్మహత్య (File/Photo)

ప్రముఖ దర్శకుడు కుమారుడు ఆత్మహత్య (File/Photo)

బాలీవుడ్‌ (Bollywood) కు చెందిన ప్రముఖ దర్శకుడు గిరీష్ మాలిక్ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. 

  Director Son Sucide | బాలీవుడ్‌ (Bollywood) కు చెందిన ప్రముఖ దర్శకుడు గిరీష్ మాలిక్ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..  ప్రముఖ దర్శకుడి కుమారుడు మన్నన్ తాగుడుకు బానిస అయ్యాడు. ఇంట్లో వద్దని వారిస్తోన్న తాగడం ఆపడం లేదు. దీంతో అతను ఒబెసిటీతో కూడా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇకపై తాగితే అంతు చూస్తానంటూ తండ్రి బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇతను తను నివాసం ఉంటోన్న ముంబై(Mumbai) లోని అంధేరిలో ఉన్న అపార్టమెంట్ లోని ఐదో అంతస్తు నుంచి మార్చి 18న  దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటినా సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతనికి తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.

  ఈ నెల 18న హోలి రోజున మన్నన్ (Mannan) వ్యక్తి దోస్తులతో హోలి ఆడటంతో పాటు ఫుల్లుగా డ్రింక్ చేసాడు. తాగుతూ తూలుతు ఇంటికొచ్చిన అతన్ని తల్లి మందలించిడంతో ఆమెపై చిర్రెత్తిపోయాడు. ఈ నేపథ్యంలో తండ్రి గిరీష్ మాలిక్ మధ్యలో వచ్చి తల్లితో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ కొడుకు తీరును ప్రశ్నిస్తూ  తీవ్రంగా మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికీ గురైన అతను తన బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. అంతేకాదు అక్కడున్న ఫ్రెంచ్ గ్లాస్ పగలగొట్టి.. అందులోంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి అంబోలి పోలీసులు మీడియాకు తెలిపారు.

  బాలీవుడ్ దర్శకుడు గిరీష్ మాలిక్ కుమారుడు ఆత్మహత్య (File/Photo)


  కొడుకు గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో తల్లి వంటింట్లో బిజీగా ఉంటే.. తండ్రి డైరెక్టర్ గిరీష్ మాలిక్ మాత్రం ఆయన రూమ్‌లో తన పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు గదిలోపలకి వెళ్లి  కోపంగా  వెళ్లి గొళ్లెం పెట్టుకున్నాడనుకున్నారు. తీరా ఇలా ఆఘాత్యానికి పాల్పడతాడని తాము అనుకోలేదంటూ వాపోయారు తల్లిదండ్రులు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందనుకున్న తన కన్న కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడంతో  డైరెక్టర్ గిరీష్ మాలిక్ కుటుంబం షాక్‌లో ఉంది.  పోలీసులు పోస్ట్ మార్టమ్ అనంతరం అతని పార్ధివ శరీరాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సదరు దర్శకుడి స్వస్థలం ఢిల్లీ కావడంతో కుమారుడి అంతిమ సంస్కారాలు ఢిల్లీలో నిర్వహించారు. పోలీసులు యాక్సిడెంటల్ కేసుగా ఈ ఆత్మహత్యను నమోదు చేసారు.

  Balakrishna - Mahesh Babu : బాలకృష్ణను ఆ విధంగా ఫుల్లుగా వాడుకున్న మహేష్ బాబు..

  దర్శకుడు గిరీష్ మాలిక్ విషయానికొస్తే.. ఆయన బాలీవుడ్‌లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సంజయ్ దత్‌తో ఈయన చిత్రీకరంచిన ‘తోర్బాజ్’(Torbaaz) ఇతనికి మంచి పేరు తీసుకొచ్చింది. అంతకు ముందు ‘జల్’, (Jal)‘మాన్ Vs ఖాన్’  (Man Vs Khan) వంటి పలు చిత్రాలను హిందీలో తెరకెక్కించారు. ఈయన కుమారుడి మృతి విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Tollywood

  తదుపరి వార్తలు