Kajal Aggarwal: కాజల్ అగర్వాల్‌ విషయంలో ఆ వార్తను ఖండించిన దర్శకుడు..

గత కొన్నేళ్లుగా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌కు హిట్ అన్నదే ఎండమావి అయింది. తాజాగా ఈ భామను ‘ముంబాయి సాగా’ అనే బాలీవుడ్ నుంచి తొలిగించినట్టు వార్తలు పుకార్లు షికార్లు చేసాయి. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయమై క్లారిటీ ఇచ్చాడు.,

news18-telugu
Updated: September 13, 2019, 11:01 AM IST
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్‌ విషయంలో ఆ వార్తను ఖండించిన దర్శకుడు..
కాజల్ అగర్వాల్ ఫైల్ ఫోటో (Source: Twitter)
news18-telugu
Updated: September 13, 2019, 11:01 AM IST
గత కొన్నేళ్లుగా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌కు హిట్ అన్నదే ఎండమావి అయింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత ఈ అమ్మడకి సక్సెస్ అనేదే లేదు. చేసిన సినిమాలు చేసినట్టే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రణరంగం’ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భామకు తాజాగా ‘ముంబాయి సాగా’ అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్‌ను తప్పించి తమన్నాను తీసుకున్నట్టు ముంబాయి ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపించాయి. ఐతే..  ఈ ప్రచారంలో నిజం లేదని ఈ సినిమా దర్శకుడు సంజయ్ గుప్తా స్పష్టం చేశాడు. ఇప్పటికే కాజల్ అగర్వాల్‌తో ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆమె ఓ మంచి నటి. కాబట్టి ఈ తప్పుడు వార్తలను నమ్మకండి అంటూ ట్వీట్ చేసాడు.

Kajal Aggarwal cut her remuneration into lacks for John Abraham movie in Bollywood pk సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకుంటుంది కాజల్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal remuneration,kajal aggarwal rate,kajal aggarwal movies,kajal aggarwal hindi movie,kajal aggarwal john abraham,kajal aggarwal bollywood,kajal aggarwal hot scenes,kajal aggarwal hot video songs,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ సినిమాలు,కాజల్ అగర్వాల్ హిందీ సినిమాలు,కాజల్ అగర్వాల్ జాన్ అబ్రహం

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘పారిస్ పారిస్’ లో నటించింది. ఈ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. మరోవైపు ఈ భామ కమల్ హాసన్,శంకర్‌ల ‘భారతీయుడు 2’ తో పాటు సూర్య హీరోగా నటిస్తోన్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...