ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు తిరిగిరాని లోకాలను వెళుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. ఈ రోజు (మార్చి 24) తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ప్రదీప్ సర్కార్.. అందుకోసం డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే పొటాషియం స్థాయులు క్రమంగా పడిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడే తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ సర్కార్ కన్నుమూశారని తెలిసి బాలీవుడ్ తారాలోకం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.
ప్రదీప్ సర్కార్ ని బాలీవుడ్ లోకం ముద్దుగా దాదా అని పిలుస్తుంది. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి పాపులర్ సినిమాలు రూపొందించారు ప్రదీప్ సర్కార్. బాలీవుడ్ లో ఎంతో మంది తారలను వెండితెరకు పరిచయం చేసిన ఆయన.. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు.
The news of Pradeep Sarkar’s demise, ‘Dada’ to some of us is still hard to digest. My deepest condolences ????. My prayers are with the departed and his family. RIP Dada ????
— Ajay Devgn (@ajaydevgn) March 24, 2023
ప్రదీప్ సర్కార్ మరణవార్త తనను బాధించిందని పేర్కొంటూ నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రదీప్ దాదా ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు దాదా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అజయ్ దేవగణ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Bollywood news, Cinema