Karan Johar : రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీతో దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తా ఏమిటో తెలిసొచ్చింది. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఇక్కడ టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్.. బాలీవుడ్ సినిమాలు అందుకోలేకపోతున్నాయన్నారు.
Karan Johar : రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీతో దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాల సత్తా ఏమిటో తెలిసొచ్చింది. బాహుబలితో నార్త్‌లో దక్షిణాది చిత్రాల సత్తా ఏంటో చూపెట్టారు. అదే ఊపులో అక్కడ విడుదలైన కేజీఎఫ్, సాహో, వంటి సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ తెలుగులో సత్తా చాటుతోంది. బన్ని ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ మన టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు హిందీతో పాటు మలయాళం, తమిళం, కన్నడ సహా అన్ని భాషల్లో మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఇక్కడ టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్.. బాలీవుడ్ సినిమాలు అందుకోలేకపోతున్నాయన్నారు. అందుకు తాజాగా నిదర్శనం అల్లు అర్జున్ నటించి ‘పుష్ప’ మూవీ అని చెప్పారు.
హిందీలో దాదాపు రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘పుష్ప’ మూవీ డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సహా ఐదు భాషల్లో విడుదలైంది. హిందీ వెర్షన్ ఇపుడు రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇంకా బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపెడుతోంది. ‘పుష్ప’తో అల్లు అర్జున్‌కు అక్కడ క్రేజ్ పెరిగింది. గతంలో తన డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్.. ఇపుడు ‘పుష్ప’తో డైరెక్ట్ ఎటాక్ ఇచ్చారు. అంతేకాదు బన్నికి అక్కడ ఉన్న స్టార్ డమ్‌తో ‘పుష్ప’కు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయన్నారు.
#Pushpa shows no signs of fatigue in mass pockets… #PushpaHindi emerges first choice of moviegoers in *those circuits* — much, much ahead of #83TheFilm and even #SpiderMan… [Week 2] Fri 2.31 cr, Sat 3.75 cr, Sun 4.25 cr, Mon 2.75 cr. Total: ₹ 39.95 cr. #India biz… HIT. pic.twitter.com/Sjhiz9dxAV
మొత్తంగా గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు సాధిస్తోన్న వసూళ్లు హిందీలో బడా సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయన్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడిగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ ది రైజ్’ మూవీకి తెలుగులో మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఆ తర్వాత వీక్ డేస్‌లో అల్లు అర్జున్ సినిమాకు అసలు సిసలు కష్టాలు మొదలైయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘పుష్ప’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం అంత ఈజీ కాదంటున్నారు ట్రేడ్ పండితులు. నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చింది.
అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. వీక్ డేస్‌లో పుష్ప చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా పడిపోయాయి కలెక్షన్స్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 77.51 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. 11 రోజుల్లో
పుష్ప సినిమాకు రూ. 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ. 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 11 రోజుల్లో ఈ సినిమాకు రూ. 134 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం రూ. 26 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.