హోమ్ /వార్తలు /సినిమా /

Diwali in Bollywood: బాలీవుడ్ తారల దీపావళి సందడి... లండన్ లో భర్తతో ప్రియాంక చోప్రా

Diwali in Bollywood: బాలీవుడ్ తారల దీపావళి సందడి... లండన్ లో భర్తతో ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటీమణుల దీపావళి (Photo.. Instagram)

బాలీవుడ్ నటీమణుల దీపావళి (Photo.. Instagram)

బాలీవుడ్ తారలు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలువురు తారలు ఇంట్లో దీపావలను వెలిగించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • News18
  • Last Updated :

బాలీవుడ్ లో నటీనటీమణులంతా దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. పలువురు తారలు ఇంట్లో దీపాలను వెలిగించి.. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. బాలీవుడ్ అగ్ర తారలు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమనులతో పంచుకున్నారు. పండుగలకు సంప్రదాయ దుస్తువులలో దర్శనమిచ్చే తారలు.. చీరకట్టు, లంగా ఓణీ వంటిలలో దీపావళి కాంతుల్లా మెరిసిపోయారు. పలువురు డిజైనర్లు ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తువులను నటీమణులకు అందించారు.

బాలీవుడ్ లో అగ్ర తారలుగా వెలుగొందుతున్న ప్రియాంకచోప్రా, కత్రినా కైఫ్,కరీనా కపూర్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలు దీపావళిని కుటుంబసభ్యులతో జరుపుకున్నారు.బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ అదరగొడుతున్న హీరోయిన్ ప్రియాంకచోప్రా.. ఆమె తన భర్త నిక్ జోనస్ తో కలిసి లండన్ లో దీపావళిని జరుపుకున్నారు. సవ్యసాచి డిజైనర్ చీర ధరించిన ప్రియాంక.. ఆదివారం ఉదయమే ఇన్స్టాగ్రాం లో ఫోటో పెట్టారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఒక చేతిలో దీపం పట్టుకున్న ప్రియాంక, నిక్ జంట.. ఒకరికళ్లల్లో ఒకరు కలిసి చూసుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ కూడా దీపావళిని ఘనంగా చేసుకున్నారు. కరీనా, సైఫ్ లు ధర్మశాలలో ఒక సినిమా షూటింగ్ లో ఉండగా.. అక్కడే దీపావళిని చేసుకున్నారు. ఈ వేడుకకు అర్జున్ కపూర్, మలైకా అరోరా కూడా వచ్చారు.బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కూడా తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి దీపావళిని జరుపుకున్నారు. శనివారం వారి పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా .. వారి ఇంటిలో దీపావళి డబుల్ బొనాంజా తెచ్చింది.


View this post on Instagram


A post shared by Katrina Kaif (@katrinakaif)వీరేగాక చాలా మంది బాలీవుడ్ నటీమణులు దీపావళి సందర్భంగా వారి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

First published:

Tags: Alia Bhatt, Diwali, Diwali 2020, Kareena Kapoor, Katrina Kaif, Nick jonas, Priyanka Chopra, Sara Ali Khan

ఉత్తమ కథలు